అమితాబ్ వాయిస్ ఇప్పుడు అలెక్సాలో ప్రత్యక్షంగా వినొచ్చు

 అమితాబ్ వాయిస్ ఇప్పుడు అలెక్సాలో ప్రత్యక్షంగా వినొచ్చు
  • అమితాబచ్చన్ వాయిస్ తో మాట్లాడొచ్చు
  • హే అలెక్సా.. అంటే అమితాబ్ వస్తాడు

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ కు సరికొత్త ఫీచర్ ను యాడ్ చేసింది. హే.. అలెక్సా.. అనగానే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ వాయిస్ వస్తుంది. నిరంతరం కొత్త కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేసే అమెజాన్ తాజాగా ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ వల్ల అలెక్సాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో మాట్లాడవచ్చు. కొత్తగా అందుబాటులోకి తెచ్చిన  ఈ ఫీచర్‌కు సెలబ్రిటీ వాయిస్ అని పేరు పెట్టింది. భారతదేశ మార్కెట్లో అలెక్సా అమ్మకాలను పెంచుకునేందుకు ఈ ఫీచర్‌ను లాంచ్ చేసింది.
వాస్తవానికి ఈ ఫీచర్ అమెరికాలో 2019లోనే ప్రారంభించింది. అమెరికన్ నటుడు – నిర్మాత శామ్యూల్ ఎల్. జాక్సన్ వాయిస్‌ని యాడ్ చేసి లాంచ్ చేసింది. అటు తర్వాత భారతదేశ మార్కెట్ పై దృష్టి సారించిన అమితాబచ్చన్ తో ఒప్పందం చేసుకుని ఈ ఫీచర్ ను ప్రారంభించింది. అంతేకాదు అమితాబ్ జీవితానికి సంబంధించి విశేషాలను కూడా కూడ అలెక్సాలో అడగొచ్చు. అలాగే  అమితాబ్ తండ్రి,  రచయిత హరివంశ రాయ్ బచ్చన్ రాసిన కవితలు, పద్యాలను కూడా చదువుకునే అవకాశం ఉంది. అమితాబచ్చన్ సూపర్ హిట్   ఫేవరెట్ సాంగ్స్, మోటివేషనల్ కొటేషన్లు కూడా వినొచ్చు. 
వాయిస్ సెట్టింగ్ మార్చడం ఎలా..?
అమితాబ్ వాయిస్ అప్ గ్రేడ్ చేసుకోవాలంటే ముందుగా అమెజాన్ షాపింగ్ యాప్ లోని మైక్ ఐకాన్ ను నొక్కాలి. అక్కడ రూ.149 వార్షిక రుసుము చెల్లించాలి. వెంటనే ప్రారంభించడానికి ‘‘అలెక్సా.. నన్ను అమితాబ్ బచ్చన్ కు పరిచయం చేయండి’’ అని చెప్పాలి. ‘‘అమిత్ జీ’’ అన్న మేలుకొలుపు పదాన్నిఉపయోగించాలి. అటు తర్వాత పాటలు కావాలంటే అమిత్ జీ షోలేకే గానే బజాయే’’ అని చెప్పవచ్చు. అంతేకాదు అమిత్ జీ ఇది నా పుట్టిన రోజు అని అడగితే అమితాబచ్చన్ వాయిస్ తో శుభాకాంక్షలతో పుట్టిన రోజు వేడుకలకు ప్రత్యేక వాయిస్ ను జోడించవచ్చు.