హైదరాబాద్, వెలుగు: బెస్ట్ ఇన్ టెక్ అవార్డుల రెండో జాబితాను అమెజాన్ ప్రకటించింది. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, వేరబుల్స్‌లో అత్యుత్తమ బ్రాండ్లను వీటిని అందించారు. శామ్సంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా.. స్మార్ట్‌ఫోన్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. సోనీ బ్రావియా టీవీ మోస్ట్ ట్రస్టెడ్ టీవీ అవార్డును దక్కించుకుంది.
ఆసుస్ జెన్‌బుక్ ల్యాప్‌టాప్ కేటగిరీలో విజేతగా నిలిచింది. వన్‌ప్లస్ ప్యాడ్ ఉత్తమ హై–పెర్ఫార్మెన్స్ ట్యాబ్లెట్గా ఎంపికైంది. హోమ్ అప్లయన్సెస్ విభాగంలో బాష్, హాయర్, డైకిన్‌కు అవార్డులు వచ్చాయి. ఈ అవార్డు గెలుచుకున్న ఉత్పత్తులపై గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ప్రత్యేక ఆఫర్లను పొందవచ్చని కంపెనీ వెల్లడించింది.
