Amazon layoffs : 2,300 మంది ఉద్యోగులకు నోటీసులు

Amazon layoffs : 2,300 మంది ఉద్యోగులకు నోటీసులు

కాస్ట్ కట్టింగ్ పేరుతో 18వేల మంది ఉద్యోగుల్ని తొలగిస్తామని ప్రకటించిన అమెజాన్ ఆ ప్రక్రియ కొనసాగిస్తోంది. దశలవారీగా ఉద్యోగుల్ని కంపెనీ నుంచి సాగనంపుతోంది. జనవరి ఫస్ట్ వీక్ లో దాదాపు 8వేల మందిని తొలగించిన అమెజాన్ తాజాగా.. మరో 2వేల మందికి నోటీసులు ఇచ్చింది. వారిలో ఎక్కువ మంది అమెరికా, కెనడా, కోస్టారికా ఉద్యోగులు ఉన్నారు. అమెరికా కార్మిక చట్టాల ప్రకారం కంపెనీ విధుల నుంచి తొలగించే ఉద్యోగులకు 60 రోజుల ముందే నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం నోటీసులు ఇచ్చినవాళ్లను ఇప్పుడే డ్యూటీ నుంచి తొలగిస్తారా లేక 60 రోజుల వరకు ఉద్యోగాల్లో కొనసాగిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.