గుడ్న్యూస్..గుడ్న్యూస్..నిత్య జీవితంలో వినియోగించే వస్తువులను ఇంట్లో ఉండి కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అత్యంత చౌక ధరల్లో కిచెన్వేర్, టవల్స్, బెడ్లినెన్ వంటి ఇంటికి అవసరమైన వస్తువులు, ఆభరణాలు, బట్టలు ఆన్లైన్లో మీ బడ్జెట్లో కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే మీకు అమెజాన్ శుభ వార్త చెబుతోంది. మీకోసం.. తక్కువ ధరలో హోంనీడ్స్ను అందించేందుకు అమెజాన్ బజార్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ను అందుబాటులో తెచ్చింది. ఈ అప్లికేషన్ గురించి, అది అందించే ఆఫర్ల గురించి తెలుసుకుందాం..
అమెజాన్ బజార్ అనేది ఆండ్రాయిడ్ అప్లికేషన్ లోని ఓ ప్రత్యేక స్టోర్.. ఇది డైలీ మనం ఉపయోగించే వస్తువులను ఈ స్టోర్ ద్వారా కొనుగోలు చేయొచ్చు.. వినియోగదారులు రూ. 125 నుంచి మొదలైన ధరతో వంటగది వస్తువులు, యాక్సెసరీస్, బట్టలు ఇలా ఇంట్లోకి కావాల్సిన వస్తువులను ఇంటినుంచే కొనుగోలు చేయొచ్చు.
బడ్జెట్ .. ఫ్రెండ్లీ ఆఫర్లులపై దృష్టి సారించిన అమెజాన్.. బజార్ ఉత్పత్తుల ధరలను రూ. 600 కంటే తక్కువ ధరకే అందిస్తోంది. బట్టలు, యాక్సెసరీస్, ఆర్నెమెంట్ష నుంచి కిచెన్ వేర్, టవల్స్ , బెడ్ లెనెన్ వంటి ఇంటికకి అవసరమైన వస్తువుల వరకు బజార్ లో తక్కువ ధరలకే అన్ని దొరుకుతాయి.
అమెజాన్ బజార్ ద్వారా ప్రధాన బెనిపిట్ ఏంటంటే.. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రైబర్లు సాధారణంగా 4-5 రోజుల్లో డెలివరీ పొందుతారు..
అమెజాన్ ఈ -కామర్స్ మార్కెట్ దిగ్గజం.. బజార్ అనే ఫ్లాట్ ఫాం ను ప్రారంభించింది. ఇందులో లేటెస్ట్ ట్రెండీ ప్రాడక్టులను సరసమైన ధరలకు అందిస్తుంది. ప్రస్తుతం ఫ్యాషన్ మార్కెట్లో పోటీనీ తట్టుకొని ఫ్లిప్ కార్ట్, రిలయన్స్, అజియో, మీషో వంటి ఇతర ఈ-కామర్స్ వంటి ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు అమెజాన్ ఈ అప్లికేషన్ ను తీసుకొచ్చింది. సో..ట్రై ఇట్...లెట్స్ ఎంజాయ్..