3236 శాటిలైట్లను లాంచ్ చేయనున్న అమెజాన్

3236 శాటిలైట్లను లాంచ్ చేయనున్న అమెజాన్

అమెజాన్.. ప్రపంచానికే ఈ పేరు సుపరిచితం. ఆన్లైన్ వ్యాపారాల నుంచి సొంతంగా స్మార్ట్‌ స్పీకర్స్, టాబ్లెట్స్‌‌ వంటి అన్నింటినీ ఈ సంస్థ విక్రయిస్తోంది. అమెజాన్ ప్రైమ్‌ తో యూజర్లనూ ఎంటర్‌‌‌‌టైన్ చేస్తోంది. తాజాగా మరో కొత్త వెంచర్‌‌‌‌లోకి అమెజాన్ దిగుతోంది. అదే బ్రాడ్‌ బ్యాండ్ సర్వీస్ . ఈ భూమిపై ఉన్న 95 శాతం మంది జనాభాకు బ్రాడ్‌ బ్యాండ్ఇంటర్నెట్ అందించేలా.. లో ఎర్త్ ఆర్బిట్‌‌లో 3,236శాటిలైట్లను లాంచ్ చేయబోతోంది. బ్రాడ్‌ బ్యాండ్ సేవలను అందించేందుకు ‘లో ఎర్త్ ఆర్బిట్‌‌’ లోకి శాటిలైట్లను పంపిస్తామని ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేష్ యూనియన్ వద్ద ఇప్పటికే పలుసార్లు ఫైలింగ్స్ దాఖలు చేసింది. ఈ శాటిలైట్లను ఎక్కడైతే బ్రాడ్‌ బ్యాండ్ కనెక్టివిటీ సరిగ్గా ఉండదో ఈ ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంచేందుకు వాడనుంది.

గ్రీక్‌ వైర్‌‌‌‌ రిపోర్టు ప్రకారం సబ్సిడరీ కూపర్ సిస్టమ్స్ఎల్‌‌ఎల్‌‌సీ ద్వారా శాటిలైట్స్ నెట్‌‌వర్క్ ఆమోదంకోసం ఇప్పటి వరకు మూడు ఫైలింగ్స్‌‌లను అమెరికా ప్రభుత్వం వద్ద అమెజాన్ దాఖలు చేసిందని తెలిసింది. అమెజాన్ కూడా ఈ వార్తలను ధృవీకరించింది. ‘ప్రాజెక్ట్ కూపర్ అనే కొత్త కార్యక్రమం కింద‘లో ఆర్బిట్ శాటిలైట్లను ’ లాంచ్ చేయనున్నాం. వీటిద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో హై స్పీడ్ బ్రాడ్‌ బ్యాండ్ కనెక్టివిటీని అందిం చనున్నాం’ అని అమెజాన్ ప్రకటించింది. ఇది దీర్ఘకాల ప్రాజెక్ట్‌ అని, బ్రాడ్‌ బ్యాండ్ ఇంటర్నెట్ బేసిక్ యాక్ స్కూడా లేని లక్షల మంది కోసం ఇది పనిచేయనుందనిపేర్కొంది. అయితే ఎప్పుడు ఈ శాటిలైట్లను లాం చ్చేయనున్నా రో మాత్రం కంపెనీ స్పష్టం చేయలేదు.కూపర్ అనే పేరును కూడా సోలార్ సిస్టమ్‌ నుంచేపెట్టిం ది. అమెజాన్ ప్లాన్ ప్రకారం కూపర్ ప్రాజెక్ట్కిం ద లాం చ్ చేయబోతోన్న 3,236 శాటిలైట్లలో..784 శాటిలైట్లను 367 మైళ్ల ఎత్తులో, 1296 శాటి-లైట్లను 379 మైళ్ల ఎత్తులో, 1,156 శాటిలైట్లను 391మైళ్ల ఎత్తులో ఏర్పాటు చేయనుంది.

కేబుల్.కో.యూకే రీసెర్చ్ రిపోర్టు ప్రకారం బహ్రెయిన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో చాలా తక్కువ ఇంటర్నెట్ కనెక్షన్స్ అందుబాటులో ఉన్నాయని తేలింది.ఇండియాలో చాలా ప్రాంతాల్లో, ఆఫ్రికా మొత్తం రీజన్స్‌‌లో ఎలాంటి వెబ్ సర్వీసుల యాక్సస్ ఉండటంలేదని పేర్కొంది. అయితే శాటిలైట్లను వాడుతూ బ్రాడ్‌ బ్యాండ్ సేవలందించాలనుకుంటున్న కంపెనీల్లోఅమెజానే మొదటిది కాదు. ఎలన్ మాస్క్ స్పేస్‌‌ఎక్స్ఇప్పటికే రెండు ప్రోటోటైప్ శాటిలైట్లను లాంచ్ చేసింది. అమెజాన్ ప్రాజెక్ట్ కూపర్‌‌‌‌ పరిమాణంకంటే ఇది నాలిగింతలు ఎక్కువ. లండన్‌‌కు చెందిన వన్‌‌వెబ్ కూడా ఎయిర్‌‌‌‌బస్ బిల్డ్ శాటిలైట్లను ఈఏడాది మొదట్లో అంతరిక్షంలో లాంచ్ చేసింది.