అందర్నీ తీసేస్తే ఎలా : అమెజాన్ లో మరో రౌండ్ ఊస్టింగ్స్

అందర్నీ తీసేస్తే ఎలా : అమెజాన్ లో మరో రౌండ్ ఊస్టింగ్స్

అమెజాన్ మళ్లీ ఉద్యోగులను తొలగించింది. గత కొద్ది కాలంగా అమెజాన్ లేఆప్ పరంపర కొనసాగిస్తూనే ఉంది. గత సంవత్సరం 27 మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్... తాజా ఉద్యోగుల తొలగింపుపై బుధవారం ప్రకటన చేసింది. అమెజాన్ లోని మ్యూజిక్ విభాగం నుంచి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. లాటిన్ అమెరికా, ఉత్తర అమెరికా, యూరప్ వంటి దేశాల్లో అమెజాన్ మ్యూజిక్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించింది. అయితే ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తుందనేది స్పష్టం గా తెలపలేదు. 

గత నెలలో(అక్టోబర్)  అమెజాన్ తెలివిగా తన సంస్థ స్టూడియోలు, వీడియో, మ్యూజిక్ విభాగాల్లో కమ్యూనికేషన్ సిబ్బందితో సహా ఉద్యోగాలను తెలివిగా ట్రిమ్ చేస్తూ వస్తోంది. పోడ్ కాస్ట్ లను కూడా అందించే Amazon Music, ఛార్జీలతో కూడిన అన్ లిమిటెండ్ సంగీత ప్రసార సేవలను అందించడంలో Spotify, YouTube Music, Apple Music తో పోటీ పడుతోంది కూడా. 

సంస్థాగత అవసరాలు, కస్టమర్లు, బిజినెస్ దీర్ఘకాలిక కొనసాగింపును దృష్టిలో పెట్టుకొని అమెజాన్ మ్యూజిక్ టీంలోని కొంతమంది ఉద్యోగులను తొలగించినట్లు అమెజాన్ ప్రతినిధి తెలిపారు. సంస్థ అతిపెద్ద ఉద్యోగ కేంద్రాలైన వాషింగ్టన్, కాలిఫోర్నియా, న్యూయార్క్ లలో ఇటీవల కాలంలో పెద్దగా లేఆఫ్స్ లేవని తెలిపారు. అయితే అమెజాన్ మ్యూజిక్ లో పెట్టుబడులు కొనసాగిస్తామని ప్రకటించారు.