Amazon: అమెజాన్ రిపబ్లిక్ డే సేల్..భారీ డిస్కౌంట్లు

Amazon: అమెజాన్ రిపబ్లిక్ డే సేల్..భారీ డిస్కౌంట్లు

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ ఏడాది రిపబ్లిక్ డే సేల్‌ను ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 19, 2023 నుండి ప్రారంభమై.. జనవరి 22, 2023న అంటే 4 రోజుల పాటు ఈ డీల్ సాగనున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ సభ్యులకు జనవరి 18 నుండి అంటు ఒక రోజు ముందు నుంచే ఈ ఆఫర్స్ ను యాక్సెస్ చేయబడతాయని తెలిపింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా Oppo, Xiaomi, OnePlus, Samsung, Apple, Vivo  లాంటి చాలా  బ్రాండ్‌ల వస్తువులు చాలా తగ్గనున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్, గాడ్జెట్‌లు, దుస్తులు లాంటి ఇతర వస్తువులపైనా డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లను అందించనుంది. ఇంకో ముఖ్య విషయమేమిటంటే స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు లాంటి వస్తువులకైతే 75 శాతం వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉండనుంది.

వీటితో పాటు అమెజాన్ ప్రకటించిన ఈ ఆఫర్ లో బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు కలిగిన వారికి అదనపు తగ్గింపు ప్రయోజనాలు లభిస్తాయి. 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందొచ్చు. ఈఎంఐ ట్రాన్సాక్షన్లకు కూడా ఈ ఆఫర్ వర్తించనున్నట్టు ఈ కామర్స్ సంస్థ వెల్లడించింది. ఇవే కాకుంగా ప్రీ బుకింగ్, 8PM డీల్స్, బడ్జెట్ బజార్, బ్లాక్‌బస్టర్ డీల్స్ లాంటి కొత్త  లాంచ్ లు కూడా ఉంటాయని స్పష్టం చేసింది.