ధర్మసాగర్, వెలుగు: సంక్షేమ పథకాల కోసం ఎవరికీ రూపాయి ఇవ్వొద్దని నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి, అక్రమాలు లేకుండా ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.
బుధవారం ధర్మసాగర్ ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలానికి చెందిన 39 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. పెండింగ్ లో ఉన్న 121 అఫ్లికేషన్లపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ అధికారులను నిలదీశారు. నెల రోజుల్లోగా ప్రొసీజర్ పూర్తి చేసి చెక్కులు అందజేయాలని ఆదేశించారు.
