అమెజాన్ ప్రైమ్ నుంచి కొత్త సర్వీస్

అమెజాన్ ప్రైమ్ నుంచి కొత్త సర్వీస్

అమెజాన్.. అమెజాన్ ప్రైమ్ లైట్ పేరిట కొత్త సర్వీస్ ని తీసుకురానున్నారు. ఈ సర్వీస్ లో తక్కువ ధరలో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇదివరకు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ రూ.999 ఉండగా, ప్లాన్ ధర పెంచుతూ రూ. 1,499 చేసింది. దాంతో చాలామంది ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం మానేశారు. అందుకే కస్టమర్లను తిరిగి తీసుకురావడానికి అమెజాన్ ప్రైమ్ లైట్ ని తీసుకొస్తున్నారు. ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ ధర రూ. 999 ఉంటుందని తెలుస్తుంది. 

అమెజాన్ ప్రైమ్ లో ఉన్న సదుపాయాల్ని  లైట్ వెర్షన్ లో తొలగించనున్నారు. వాటిలో.. ప్రైమ్ ఫాస్ట్ డెలివరీ ఉండదు. ఫ్రీ డెలివరీ సదుపాయాన్ని ఉంచొచ్చు. ప్రైమ్ వీడియోల్లో యాడ్స్ లేకుండా సినిమా చూడొచ్చు. కానీ, లైట్ వర్షన్ లో యాడ్స్ వస్తాయి. అంతేకాకుండా ఎస్ డీ క్వాలిటీలో మాత్రమే వీడియో చూసే అవకాశం ఉంటుంది. ల్యా్ప్ టాప్ లో చూడలేరు. ప్రైమ్ మ్యూజిక్, ఇ-బుక్, గేమ్స్, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉండవు. ఈ రెండు ప్లాన్లు కాకుండా మొబైల్ కోసం ఏడాది సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ రూ.599తో తీసుకొస్తుంది.