పవన్ పెళ్లిళ్ల వీరుడు.. ఆయనకు సిద్ధాంతాలు ఉండవు: అంబటి

పవన్ పెళ్లిళ్ల వీరుడు.. ఆయనకు సిద్ధాంతాలు ఉండవు: అంబటి

జనసేనాని పవన్‌పై మరోసారి ధ్వజమెత్తారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ పంది మీద ఊరేగుతున్నకుక్క.. పెళ్లిళ్ల వీరుడు పవన్ కల్యాణ్‌..అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. భీమవరం వేదికగా ప్రభుత్వంపై పవన్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చిన అంబటి.. ఢిల్లీ పెద్దలతో నీకు సన్నిహిత సంబంధం ఉంటే రాష్ట్రానికి మేలు చేయ్‌.. సీఎం జగన్ను బెదిరిస్తున్నావా..? మతిభ్రమించి మాట్లాడుతున్న పవన్  కుక్క లాంటి వాడు అంటూ మండిపడ్డారు. జగన్ రాజకీయాన్ని చూసి నేర్చుకో.. తప్పుడు కేసులు పెట్టినా జగన్ భయపడకుండా పోరాటం చేశాడని గుర్తుచేశారు. 

పవన్ పెళ్లిళ్ల వీరుడు

నలుగురు విప్లవ కారులు పేర్లు తెలిస్తే నువ్వు విప్లవ కారుడివా..? వివాహ వ్యవస్థలో విప్లవం తెచ్చావా? అంటూ సెటైర్లు వేశారు. వివాహ వ్యవస్థపై నీకు నమ్మకం లేదు.. పెళ్లిళ్ల వీరుడు పవన్‌ కల్యాణ్‌ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. అలాంటి వ్యక్తి ప్రజలకు నీతులు చెప్తున్నాడు. పేదలకు,పెత్తందార్ల మధ్య పోరాటంలో జగన్ పేదల పక్కన నిలబడితే పవన్,చంద్రబాబు పక్కన చేరాడని విమర్శించారు. పవన్ మాటలు సంస్కార హీనంగా ఉన్నాయి. పవన్ మాటలతో అసాంఘిక శక్తులను రెచ్చగొట్టాలని చూస్తున్నాడని ఆరోపించారు. యువత అప్రమత్తంగా ఉండాలని... పవన్ కు  సిద్ధాంతాలు తెలియవని.. తప్పులన్నీ ఆయన దగ్గర పెట్టుకుని ఎదుటి వారిని దూషించే మనస్తత్వం పవన్ ది అని ఫైర్‌ అయ్యారు.

పవన్ వి బ్లాక్ మెయిల్ రాజకీయాలు

చిత్తశుద్ధిగా పరిపాలిస్తున్న జగన్పై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నాడు అని పవన్‌పై మండిపడ్డ అంబటి రాంబాబు. సీఎం జగన్ గురించి నాకు అంతా తెలుసు అని బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నాడు. హైదరాబాద్ నుంచి వచ్చి మమ్మల్ని గెలకక పోతే పవన్ కు తోచదన్న ఆయన..వారాహి పైకి ఎక్కి చిందులు వేస్తున్న ప్రాణాలు కు తెగించానని చెప్తున్నాడు.. చంద్రబాబు ,లోకేష్ ల పల్లకీలు మోస్తున్న పవన్ కు విప్లవం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. మరోవైపు.. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనను చంద్రబాబుకు అమ్మేశాడన్న అనుమానం ఉంది.. వారాహి పేరు పెట్టుకుని ఆ వాహనం పై నుండి అసత్య ప్రచారాలు, అసభ్య పదజాలం వాడుతున్నాడు.. అందుకే పవన్ పంది మీద ఊరేగుతున్న కుక్క అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు.