తెలంగాణలో బెస్ట్ లా కాలేజీగా అంబేద్కర్ లా కాలేజీ

తెలంగాణలో బెస్ట్ లా కాలేజీగా అంబేద్కర్ లా కాలేజీ

మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి స్థాపించిన అంబేద్కర్ విద్యాసంస్థలు ఇండియా టుడే ర్యాంకింగ్స్ లో బెస్ట్ విద్యాసంస్థలుగా నిలిచాయి. విద్యాసంస్థల్లో కోర్సుల వారీగా ఇండియా టుడే సంస్థ ర్యాంకులు ఇస్తోంది. ఇందులో గతంలోనూ బెస్ట్ గా నిలిచిన అంబేద్కర్ విద్యాసంస్థలు మరోసారి బెస్ట్ ర్యాంకులతో ముందున్నాయి. ముఖ్యంగా అంబేద్కర్ లా కాలేజీ రాష్ట్రంలోనే రెండో ర్యాంక్ లా కాలేజీగా నిలిచింది. 

దేశ వ్యాప్తంగా వేలాది లా కాలేజీల్లో 65వ ర్యాంక్ సాధించింది. ఇక బీఎస్సీ కోర్సు టీచింగ్ లో రాష్ట్రంలో అంబేద్కర్ కాలేజీ ప్రత్యేకత చాటుకుంది. ఇండియా టుడే ర్యాంకింగ్ లో 5 ర్యాంక్ అందుకుంది. బీఏ కోర్సు టీచింగ్ లో 7వ ర్యాంకును, బీబీఏ కోర్సులో 9వ ర్యాంకు, బీకామ్ బోధనలో 12వ ర్యాంకులతో బెస్ట్ కాలేజీగా నిలిచింది. ఇటు లా కాలేజీతో పాటు డిగ్రీ కాలేజీ వేర్వేరు కోర్సుల్లో మంచి ర్యాంకింగ్ తో అంబేద్కర్ విద్యాసంస్థలు మంచి చదువుకు వేదికగా మారాయి. మెరుగైన టీచింగ్, చదువునే వాతావరణం, ఫెసిలిటీస్ లాంటి అంశాల ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటించారు.