వరదల్లో ప్రాణాలకు తెగించిన 108 అంబులెన్స్ డ్రైవర్

వరదల్లో ప్రాణాలకు తెగించిన 108 అంబులెన్స్ డ్రైవర్

అంబులెన్స్ వస్తుందంటే అందరూ దారి ఇస్తారు.  మూగ జీవాలైతే సైరన్ సౌండ్ కు పక్కకు వెళ్తాయి.  మరి నదులు, సముద్రాలైతే వాటిలోనుంచి మనమే వెళ్లాలి.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.  దీంతో చాలా  రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.  నదిలా తలపించే రోడ్డుపై ఓ అంబులెన్స్ చేసిన డ్రైవర్ చేసిన సాహసానికి అందరూ హ్యాట్సాఫ్ చెపుతున్నారు.

 అయితే అంబులెన్స్ డ్రైవర్ తన ప్రాణాలను లెక్కచేయకుండా ఓ పేషెంట్ ప్రాణాలను కాపాడిన ఘటన ఎన్టీఆర్ ( ఉమ్మడి కృష్ణా) జిల్లా  వత్సవాయిలో చోటు చేసుకుంది.  ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు మునిగిపోయాయి.  వత్సవాయి బ్రిడ్జిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది.   డయాలసిస్ తో బాధపడుతున్న కొలగంటి బాబూరావు అనే వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో బాబూరావును జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.   సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ డ్రైవర్ కార్తీక్ లింగాల ... పెనుగంచిప్రోలు మూనేరు బ్రిడ్జిపై వరద నీటిలో అంబులెన్స్ ను డ్రైవ్ చేసి పేషంట్ ప్రాణాలను కాపాడాడు.   దీనిని చూసిన స్థానికులు డ్రైవర్ కార్తీక్ ను అభినందించారు.