ప్లాస్మా ట్రీట్‌మెంట్‌కు అమెరికా గ్రీన్ సిగ్నల్

ప్లాస్మా ట్రీట్‌మెంట్‌కు అమెరికా గ్రీన్ సిగ్నల్

ఇప్పటి వరకు 70 వేలమందికి ఈ చికిత్స అందించినట్లు ఎఫ్‌‌‌‌‌‌‌‌డీఏ వెల్లడి

వాషింగ్టన్: కరోనా పెషెంట్లకు ప్లాస్మా ట్రీట్ మెంట్ అందించేందుకు అమెరికా అనుమతించింది. కరోనా బారిన పడి కోలుకున్నవారి నుంచి ప్లాస్మా సేకరించి 70 వేల మంది పేషెంట్లకు ట్రీట్ మెంట్ అందించినట్లు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) ప్రకటించింది. ప్లాస్మా ట్రీట్మెంట్ కోసం ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్(ఈయూఏ) ఇచ్చినట్లు తెలిపింది. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా కరోనా పేషెంట్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ బాగా పని చేస్తోందని తెలిపింది. వ్యాధి తీవ్రతను, కరోనా నుంచి కోలుకునే సమయాన్ని తగ్గించడానికి ఈ ట్రీట్ మెంట్ ఎఫెక్టివ్క్టిగా ఉన్నట్లు వెల్లడించింది. ‘కరోనా సోకిన వెంటనే ట్రీట్ మెంట్ అందిస్తే మూడు రోజుల్లో కోలుకుంటున్నట్లు మేము సేకరించిన డేటా ద్వారా తెలుస్తోంది. ప్లాస్మా లో హైలెవెల్ యాంటీబాడీలు ఉండటంతో ట్రీట్ మెంట్ లో ఎక్కువ ఉపయోగ పడుతోంది. దీంతో 35 శాతం మేర మరణాలు తగ్గించగలిగాం. కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ విషయంలో ఇది మంచి ముందడుగు. ఇప్పటి వరకు 70 వేల మందికిపైగా కరోనాపేషెంట్లకు ట్రీట్ మెంట్ అందించాం. చాలా
మంది ప్లాస్మా డొనేట్ చేసేందుకు ముందుకు వస్తున్నారు’ అని హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ అలెక్స్ అజర్ అన్నారు. అయితే ఈ ట్రీట్ మెంట్ పై పలువురు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ప్లాస్మాట్రీట్ మెంట్ ఎంత ఎఫెక్టివ్ గా పని చేస్తోందని చెప్పడానికి సరిపడా డేటా లేదు అని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ జోనాథన్ రైనర్ అన్నారు. మరోవైపు ఎఫ్డీఏ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ లో ఆయన మాట్లాడుతూ.. చైనా వైరస్పై పోరులో భాగంగా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్లాస్మా ట్రీట్మెంట్కు అనుమతించడం సంతోషంగా ఉంది. ఈ ట్రీట్మెంట్ ను ఎక్కువ మందికి అందిస్తాం అని ట్రంప్ చెప్పారు.

For More News..

సీఆర్‌పీఎఫ్‌ బెటాలియన్‌కు కరెంట్ షాక్.. రూ.1500 వాడితే కోటిన్నర బిల్లు