వైరల్ వీడియో: బాహుబలి మార్ఫ్ వీడియోలో ట్రంప్ ఫ్యామిలీ

వైరల్ వీడియో: బాహుబలి మార్ఫ్ వీడియోలో ట్రంప్ ఫ్యామిలీ

ఫిబ్రవరి 24, 25 తేదీలలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వస్తున్నారు. ట్రంప్ తన పర్యటనకు సంబంధించి హీరో ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ సినిమాకు చెందిన ఒక మార్ఫ్ వీడియోను తన ట్వీట్టర్‌లో షేర్ చేశారు. అది సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తుంది. భారత్‌లోని తన స్నేహితులను కలవడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని ఆ వీడియోకు ట్యాగ్ చేశారు. ఆ మార్ఫ్ వీడియోలో ట్రంప్‌తో పాటు.. మెలానియా ట్రంప్, ఇవాంక ట్రంప్, జూనియర్ ట్రంప్ కూడా ఉన్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వీడియోలో వీరితో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఆయన భార్య జశోధా బెన్ కూడా ఉన్నారు.

‘సోల్’ పేరుతో ఉన్న ఒక ట్విట్టర్ వినియోగదారుడు ఈ వీడియోను తన ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోను ట్రంప్ రీట్వీట్ చేస్తూ పైవిధంగా పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం మధ్యాహ్నం గుజరాత్‌లోని అహ్మదాబాద్ చేరుకోనున్నారు. అక్కడి మోటెరా స్టేడియంలో ఆయన ప్రసంగించనున్నారు. ఆ సభకు దాదాపు 100,000 మంది జనాభా వస్తారని సమాచారం. ఆ సభ తర్వాత ట్రంప్ సబర్మతిలోని గాంధీ ఆశ్రమాన్ని కూడా సందర్శించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మంగళవార ఉదయం ట్రంప్ ఢిల్లీ చేరుకుంటారు. అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌కు రాష్ట్రపతి భవన్‌లో ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత ట్రంప్, మోడీ హైదరాబాద్ హౌజ్‌లో సమావేశమై పలు విషయాలపై చర్చిస్తారు.

ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్ పాల్గొంటారు. అమెరికాలోని భారతీయ కంపెనీల అధికారులతో సమావేశమై అమెరికా వ్యాపార ప్రయోజనాల గురించి మాట్లాడుతారు. ఈ సమావేశంలో భారత చమురు మరియు గ్యాస్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా సన్స్, భారత్ ఫోర్జ్, మహీంద్రా మరియు మహీంద్రా సంస్థలు పాల్గొంటాయి. ఆ తర్వాత ట్రంప్ విందులో పాల్గొని వాషింగ్టన్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

For More News..

‘వెలుగు’ ఎఫెక్ట్: దారికొచ్చిన మంత్రులు

టీచర్లకు గుడ్‌న్యూస్.. సర్వీసులో చేరిన మొదటి రోజు నుంచే బెనిఫిట్స్