బార్లో భార్యతో గొడవ..ఫ్రస్టేషన్లో భర్త కాల్పులు..ఐదుగురు మృతి

బార్లో భార్యతో గొడవ..ఫ్రస్టేషన్లో భర్త కాల్పులు..ఐదుగురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పులు కలంకలం రేపాయి. కాలిఫోర్నియా లోని ఆరెంజ్‌ కౌంటీలో  బైకర్స్‌ బార్‌ వద్ద ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ  కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు.  అమెరికా కాలమానం ప్రకారం..ఆగస్టు 23వ తేదీ  బుధవారం రాత్రి 7.30 గంటలకు ఈ ఘటన జరిగింది. 

ఈ కాల్పులకు తెగబడింది  రిటైర్డ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ అని తెలుస్తోంది. రిటైర్డ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అతని భార్య మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఘర్షణ పెరిగడంతో సహనం కోల్పోయిన అధికారి..  పదకొండు మందిపై కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈకాల్పుల్లో షూటర్ తో సహా  నలుగురు వ్యక్తులు అక్కడకిక్కడే ప్రాణాలు కోల్పోయారు.  మరో  ఐదుగురు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

కాల్పుల ఘటన గురించి సమాచారం అందగానే అక్కడికి చేరుకున్న పోలీసులు .. నిందితుడిని అడ్డుకునేందుకు జరిపిన కాల్పుల్లో అతడు హతమయ్యాడు.