తప్పిన పెద్ద విమాన ప్రమాదం : రన్ వేపైనే ఊడిపోయిన టైర్లు

తప్పిన పెద్ద విమాన ప్రమాదం : రన్ వేపైనే ఊడిపోయిన టైర్లు

అమెరికాలో అతి పెద్ద విమాన ప్రమాదం తప్పింది. పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించటంతో.. విమానంలోని 176 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..ఫ్లోరిడాలోని తంపా నుండి బయలుదేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 590 టేకాఫ్ సమయంలో టైర్లు ఊడిపోయాయి. విమానం టేకాఫ్ అవ్వటానికి కొద్దీ క్షణాల ముందు వేగం పుంజుకోగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

 

టైర్లు ఊడిపోవటాన్ని గమనించిన పైలట్ అప్రత్తమయ్యాడు. విమానం రన్‌వే చివర బారెల్‌తో దూసుకెళ్లడంతో పైలట్ బ్రేక్‌లు వేశాడు. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించటంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫ్లైట్ లో మొత్తం 176 మంది ప్రయాణికులు మరియు ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. అప్రమత్తంగా వ్యవహరించి తమ ప్రాణాలను కాపాడిన సదరు పైలట్ కు ప్రయాణికులు, సిబ్బంది కృతఙ్ఞతలు తెలిపారు.

Also Read:ఐ ఫోన్ కస్టమర్లకు అలర్ట్ : పెగాసస్ తరహా స్పైవేర్ ఎటాక్స్ జరగొచ్చు