హెచ్‌1బీ వీసా రూల్స్ మార్చిన అమెరికన్ ప్రభుత్వం

హెచ్‌1బీ వీసా రూల్స్ మార్చిన అమెరికన్ ప్రభుత్వం

అమెరికన్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇచ్చే హెచ్1-బీ వీసాలలో కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోని యువతకు ఉద్యోగాలలో ప్రాముఖ్యతను ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికన్ ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయంతో భారత టెకీలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ప్రతి ఏటా మన దేశం నుంచి చాలామంది ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తుంటారు. అక్కడికి వెళ్లిన తర్వాత హెచ్‌1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటుంటారు. అయితే కరోనావైరస్ వల్ల విదేశాలకు చెందిన వారికి ఇచ్చే వీసాల‌ను ప‌రిమితం చేస్తున్నట్లు అక్కడి ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. హెచ్‌1బీ వీసా ప్రోగ్రామ్ కింద ఎవ‌రికి వీసా జారీ చేయాలి, వారికి ఎంత జీతం ఇవ్వాలి అనే అంశాల‌ను త్వ‌ర‌లోనే రిలీజ్ చేస్తామని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. ప్రతి ఏటా ఇచ్చే 85 వేల హెచ్1బీ వీసాలను పావు వంతు తగ్గిస్తున్నట్లు హోమ్‌ల్యాండ్ యాక్టింగ్ డిప్యూటీ సెక్ర‌ట‌రీ మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబ‌ర్ అధికారులు వెల్లడించారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత జూలైలో హెచ్‌1బీ వీసాల ప్రోగ్రామ్‌ను ర‌ద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. అమెరికా వ‌ర్క‌ర్ల స్థానంలో త‌క్కువ జీతాల‌కు విదేశీయుల‌ను రిక్రూట్ చేస్తున్న విధానాన్ని ర‌ద్దు చేయాల‌ని ట్రంప్ పేర్కొన్నారు. టెక్నాలజీ రంగంలో కొన్ని ఉద్యోగాల కోసం మాజీ అధ్య‌క్షుడు జార్జ్ బుష్ హెచ్‌1బీ ప్రోగ్రామ్‌ను అమలులోకి తీసుకువచ్చారు. తాజా గణాంకాల ప్రకారం.. అమెరికాలో హెచ్‌1బీ వీసా కింద ఆశ్ర‌యం పొందిన 5 ల‌క్ష‌ల మందిలో ఎక్కువ శాతం భార‌త్‌, చైనా దేశాలకు చెందిన వారే ఉండటం గమనార్హం. హోమ్‌ల్యాండ్ డిపార్ట్‌మెంట్ రూపొందించిన ఈ కొత్త రూల్స్‌ను త్వరలోనే ఫెడ‌ర‌ల్ రిజిస్టార్‌లో ప‌బ్లిష్ చేయ‌నున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో దేశ ప్రజలను తన వైపు తిప్పుకోవడం కోసమే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.

For More News..

జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీ పార్థసారధి స్పష్టత

అత్తింటి వేధింపులతో అల్లుడు మృతి

కడుపునొప్పని బాలుడిని ఆస్పత్రికి తీసుకెళితే.. కడుపులో ఊహించని విధంగా..