5 నిమిషాల్లో కరోనా రిజల్ట్

5 నిమిషాల్లో కరోనా రిజల్ట్
  • కొత్త ‘క్రిస్పర్ ’ టెస్ట్​ను అభివృద్ధి చేసిన అమెరికా సైంటిస్టులు
  • ఇల్లు, ఆఫీసు, స్కూళ్లలోనూ చేసుకోవచ్చంటున్న రీసెర్చర్లు

న్యూయార్క్​: ఒంట్లో కరోనా వైరస్​ ఉందో లేదో తెలుసుకునేందుకు ముందుగా తీసుకొచ్చిన టెస్ట్​.. ఆర్టీపీసీఆర్​ (రియల్​ టైం పాలిమరేస్​ చెయిన్​ రియాక్షన్​). ఆ టెస్టు రిజల్ట్​ రావడానికి ఒక రోజు నుంచి 3 రోజుల దాకా పడుతోంది. తర్వాత మరింత సింపుల్​ టెస్ట్​ వచ్చింది. అదే యాంటీ జెన్​ టెస్ట్​. అరగంట లోపలే ఈ టెస్ట్​తో రిజల్ట్​ వస్తోంది. ఇప్పుడు ఎక్కువగా చేస్తున్న టెస్టులూ ఇవే. కొత్తగా ఫెలుడా అనే టెస్టునూ లాంచ్​ చేశారు. కానీ, వీటన్నింటినీ తలదన్నే ఓ కొత్త టెస్ట్​ను సైంటిస్టులు కనుగొన్నారు. ఆ టెస్ట్​తో జస్ట్​ ఐదు నిమిషాల్లోనే రిజల్ట్​ వచ్చేస్తుందట. రిజల్ట్​ ఇవ్వడమే కాదు.. ఒంట్లో ఎంత మొత్తంలో వైరస్​ ఉందో కూడా చెప్పేస్తుందట. ఎక్కడైనా టెస్టు చేయొచ్చట. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్​ కాలిఫోర్నియా సైంటిస్టులు తయారు చేసి ఆ టెస్ట్​ పేరు ‘క్రిస్పర్​ జీన్​ ఎడిటింగ్​ టెస్ట్​’. సింపుల్​గా చెప్పాలంటే క్రిస్పర్​ టెస్ట్​.

టెస్ట్​ ఎట్లా చేస్తరు?

కరోనా వైరస్​లోని ఆర్​ఎన్​ఏ (రైబోన్యూక్లియిక్​ యాసిడ్​)ను గుర్తించడం ద్వారా కరోనా ఉందో లేదో ఈ టెస్ట్​ తేలుస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఆర్​ఎన్​ఏ సీక్వెన్స్​ టార్గెట్​గా ‘గైడ్​’ ఆర్​ఎన్​ఏని సైంటిస్టులు డెవలప్​ చేశారు. శాంపిల్​ సొల్యూషన్​లోకి దీనిని పంపితే.. ఆర్​ఎన్​ఏకి బైండ్​ అవుతుంది. తర్వాత క్రిస్పర్​ టూల్​ అయిన సీఏఎస్​13తో ఆర్​ఎన్​ఏని మానిప్యులేట్​ చేస్తారు. వెంటనే డీఎన్​ఏ కత్తెర ఆన్​ అయి ఒక తీగ ఉన్న ఆర్​ఎన్​ఏని కట్​ చేస్తుంది. ఆ కట్​ చేసిన ఆర్​ఎన్​ఏలు శాంపిల్​ టెస్ట్​ సొల్యూషన్​లో ఓ కాంతినిచ్చే పార్టికల్స్​ను రిలీజ్​ చేస్తాయి. ఆ సొల్యూషన్​లోకి లేజర్​ లైట్​ పంపితే అవి వెలిగిపోతాయి. అలా వెలుతురు వచ్చిందంటే కరోనా ఉన్నట్టే. ఆ వెలుతురు సిగ్నల్​ ఎంత పవర్​ఫుల్​గా ఉంటే వైరస్​ పార్టికల్స్​ అంత ఎక్కువగా ఉన్నట్టు. కాబట్టి టెస్ట్​తో పాటే వైరల్​ లోడ్​ కూడా ఎంతుందో ఈ టెస్ట్​తో చెప్పొచ్చంటున్నారు సైంటిస్టులు.

ల్యాబ్​లు అవసరం లేదు

ఇప్పటికే చేసిన స్టడీలో టెస్ట్ పనితీరు బాగా ఉందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా మాలిక్యులార్ బయాలజిస్ట్ శాంటా బార్బారా చెప్పారు. ఐదు శాంపిల్స్​ను టెస్ట్ చేస్తే
కచ్చితత్వంతో రిజల్ట్ వచ్చిందన్నారు. ఒక్కో శాంపిల్ కు జస్ట్ ఐదు నిమిషాలు మాత్రమే పట్టిందని చెప్పారు. టెస్టులు చేయడానికి ఖరీదైన ల్యాబులు అవసరం లేదని, డాక్టర్ చాంబర్లు లేదా స్కూళ్లు, ఆఫీసులు, ఇంట్లో నైనా టెస్టులను ఈజీగా చేసుకోవచ్చని ఆమె వివరించారు.