ఇది దేశ ప్రజల విజయం: అమిత్ షా

ఇది దేశ ప్రజల విజయం: అమిత్ షా

ఢిల్లీ లోని బీజేపీ హెడ్ ఆఫీసులో ఆ పార్టీ నేత అమిత్ షా మాట్లాడారు. పార్టీ భయట ఏర్పాటు చేసిన సభలో  అమిత్ షా మాట్లాడుతూ.. 2019 లోక్ సభ ఎన్నికలలో NDA ను గెలిపించినందుకు దేశప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.  ఈ మీటింగ్ లో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు.

అమిత్ షా మాట్లాడుతూ దేశప్రజలు తమకు ఇచ్చిన మహావిజయంగా అభివర్ణించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో లభించిన గొప్పవిజయం అని ఆయన అన్నారు.దీంతో పాటు.. ఈ విజయం దేశ ప్రజల విజయం అని.. ‘సబ్ కా సాత్ సడ్ కా వికాస్’  విజయం అని ఆయన అన్నారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో దేశంలో ఉన్న  గరీబోళ్ల  కోసం నరేంద్ర మోడీ పాటు పడ్డారని ఆయన తెలిపారు. ఆ గరీబోళ్లే బీజేపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారని అన్నారు.