హైదరాబాద్‌‌లో అమిత్ షా

V6 Velugu Posted on May 14, 2022

కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ లో అడుగు పెట్టారు. బేగంపేట విమానాశ్రయానికి ఆయన ప్రత్యేక విమానంలో వచ్చారు. ఆయనకు రాష్ట్ర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు, బీజేపీ నేతలు డీకే అరుణ, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, మురళీధర్ రావు తదితర నేతలు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం షా.. బేగంపేట నుంచి రామాంతాపూర్ ఫోరెన్సిక్ ల్యాబ్ (CFSL)కు వెళ్లారు. ఇక్కడ గంట సేపు ఉండనున్నారు. 

అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శంషాబాద్‌‌లోని నోవాటెల్ హోటల్‌‌కు చేరుకుంటారు. ఇక్కడ నిర్వహించే బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో నేతలకు షా దిశా నిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు హోటల్ నుంచి తుక్కుగూడ వెళ్తారు. రాత్రి 8 గంటల వరకు బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 8.30 గంటలకు శంషాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తారు అమిత్ షా.

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, ఎంపీ బండి సంజయ్  చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగూడలో భారీ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తుక్కుగూడ ORR ఎగ్జిట్ - 14 సమీపంలో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తుకు, వచ్చే ఎన్నికల లక్ష్యానికి ఈ సభ కీలకమని భావిస్తోంది కమలం పార్టీ. మరి ఈ మీటింగ్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేస్తారో చూడాలి.

మరిన్ని వార్తల కోసం : 
బీజేపీ బహిరంగ సభకు హాజరుకానున్న అమిత్ షా


బండి సంజయ్‌‌కి మంత్రి కేటీఆర్ నోటీసులు.. ఆధారాలుంటే బయటపెట్టాలి
 

 

Tagged Central home minister Amit Shah, , Praja Sangrama Yatra, Tukkuguda BJP, Bandi Sanjay Meeting In Tukkuguda, Amit Shah Hyderabad Tour

Latest Videos

Subscribe Now

More News