
- బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావుకు అమిత్ షా సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పాత, కొత్త నేతలంతా కలిసి పని చేయాలని కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. ఢిల్లీలో అమిత్ షాను రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన రాంచందర్ రావును అమిత్ షా అభినందించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కాగా, 2 రోజుల పాటు రాంచందర్ రావు ఢిల్లీలోనే ఉన్నా.. ఆయనకు అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకలేదు. దీంతో ఆయన తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. గురువారం అపాయింట్ లభించడంతో తిరిగి ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కలిశారు.