Amitabh Bachchan: రణబీర్ రామాయణంలో జటాయువుగా అమితాబ్.!

Amitabh Bachchan: రణబీర్ రామాయణంలో జటాయువుగా అమితాబ్.!

ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న రామాయణ సినిమాలో బిగ్ బీ అమితాబ్ నటించబోతున్నారని తెలుస్తోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం.. అమితాబ్ బచ్చన్ రామాయణంలో దైవిక పక్షి జటాయువు పాత్రకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారని సమాచారం.

జటాయువు పాత్రకు అమితాబ్ వాయిస్ ఓవర్ అందించడం సినిమాకు చాలా విలువైనదిగా భావిస్తున్నారు మేకర్స్. ఎందుకంటే అమితాబ్ వాయిస్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందువల్ల ప్రేక్షకులపై గొప్ప ప్రభావం చూపుతుందని మేకర్స్ డిసైడ్ అయ్యారు.

అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మహాభారతం ఆధారంగా ఇటీవల రూపొందిన 'కల్కి 2898 ఏడీ'లో అశ్వత్థామ పాత్రలో అద్భుతమైన నటనతో ఆశ్చర్యపరిచారు బిగ్ బీ.

ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదలై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఇందులో నటిస్తున్న వారి పాత్రలపై సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. ముందుగా రావణుడి పాత్రలో యశ్ గురించి.. బాలీవుడ్ నటుడు, చిత్ర నిర్మాత రాజ్ బి శెట్టి తన అభిప్రాయాన్ని తెలిపారు.

యశ్ ఎంపికపై రాజ్ తన ఇన్స్టాలో స్పందించారు. యశ్ ఆ పాత్రలో వందశాతం న్యాయం చేస్తారని తెలిపారు. అయితే, సీత పాత్రలో సాయి పల్లవి సెట్ అవ్వలేని, తనకు బదులు కాజల్ను పెడితే బాగుండేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఒక అమరమైన ఇతిహాస గాథ.. రామ వర్సెస్ రావణ. అధికారం, ప్రతీకారానికి ప్రతిరూపంగా రావణుడిని.. ధర్మం, త్యాగానికి నిర్వచనంగా రాముడి పాత్రను పరిచయం చేసిన తీరు సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. 

►ALSO READ | NATS : టాంపాలో వైభవంగా ముగిసిన 8వ నాట్స్ తెలుగు సంబరాలు: సందడి చేసిన సినీ సెలబ్రిటీలు

ఇకపోతే.. ఈ మూవీలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, లక్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్‌‌‌‌‌‌‌‌, మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి, సెకండ్ పార్ట్‌‌‌‌‌‌‌‌ను 2027 దీపావళికి విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

జటాయువు:

జటాయువు రామాయణంలో అరణ్యకాండలో వచ్చే ఒక పాత్ర (గ్రద్ద). రావణుడు సీతని ఎత్తుకుని వెళ్తున్నపుడు జటాయువు అతనితో వీరోచితంగా పోరాడి రెక్కలు పోగొట్టుకుంటాడు, ఓడిపోతాడు. చివరకు రాముడికి సీతాపహరణ వృత్తాంతం చెప్పి ప్రాణాలు విడుస్తాడు. జటాయువు త్యాగానికి చలించిన శ్రీరాముడు స్వయంగా రాముడే జటాయువుకి దహన సంస్కారాలు చేస్తాడు.