
సీఏఏ పై ప్రజలను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బిహార్ లోని వైశాలి సభకు అమిత్ షా హాజరయ్యారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ముస్లింలు చదవాలని కోరారు. అవగాహన పెంచుకోవాలని, ఇది ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. రాహుల్ గాంధీ అండ్ కంపెనీ.. రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తూ జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. నితీష్ కుమార్ నాయకత్వంలో బిహార్ లో జేడీయూ,బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్నారు.