బహ్రెయిన్ లో గుండెపోటుతో వ్యక్తి మృతి..మృతుడిది రాజన్న సిరిసిల్ల జిల్లా కంచర్ల

బహ్రెయిన్ లో గుండెపోటుతో వ్యక్తి మృతి..మృతుడిది రాజన్న సిరిసిల్ల జిల్లా కంచర్ల
  • డెడ్ బాడీని సొంతూరికి తెప్పించాలని వేడుకుంటున్న కుటుంబం

వీర్నపల్లి, వెలుగు:  ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. వీర్నపల్లి మండలం కంచర్లకు చెందిన దేవోల్ల హనుమంతు (36), ఏడాదిన్నర కింద బహ్రెయిన్ కు వెళ్లాడు. అక్కడ శుక్రవారం ఉదయం పనికి వెళ్లే సమయంలో అతనికి ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ వచ్చి మృతిచెందాడు. మృతుడికి భార్య సుమలత, కూతుళ్లు ఇందు, లాస్య ఉన్నారు. హనుమంతు డెడ్ బాడీని సొంతూరుకు తెప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరారు.