ఓ వ్యక్తి మూడేళ్ల బాలుడి ప్రాణాలు పొట్టనబెట్టుకున్నాడు. బాలుడు ఇంటి ముందు ఆడుకోవడం ఇష్టం లేదని కత్తితో పొడిచి అతి కిరాతంగా చంపాడు. తీవ్రంగా రక్తస్రావం అయిన బాలుడిని హాస్పిటల్ కు తరలించారు. ట్రీట్ మెంట్ తీసుకుంటూ బాబు చనిపోయాడు. అతను అలా చేయడానికి మరో కారణం ఉంది..
బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మూడేళ్ల బాలుడిని ఓ వ్యక్తి కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ దారుణ ఘటన దిఘ్రా గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడు స్నేహితులతో కలిసి నిందితుడి ఇంటి బయట ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు.
ALSO READ | కొత్త ఫోన్ కొని.. ఫ్రెండ్స్ చేతిలో చనిపోయాడు.. ఎందుకంటే..?
పిల్లలు తమ ఇంటి బయట ఆడుకోవడం నిందితుల కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని వారు తెలిపారు. అందుకే బాలుడిని కత్తితో పొడిచాడు. దాంతోపాటు నిందితుడికి మతిస్థిమితం కూడా సరిగా లేదని ముజఫర్‌పూర్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ వినీతా సిన్హా చెప్పారు. బాలుడిపై కత్తితో దాడి చేశాడన్న వార్త తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాబు మృతి చెందాడు.
బీహార్‌లోని ముంగేర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు మైనర్ బాలుడిని కాల్చి చంపిన ఘటన కూడా అదే రోజు జరిగింది. మంగళవారం తెల్లవారుజామున, బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో 17 ఏళ్ల బాలుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు తపశ్వి కుమార్ (17)గా గుర్తించారు. వాసుదేవ్‌పూర్ ప్రాంతంలోని మండలం తోలా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కుమార్‌పై కాల్పులు జరిపారని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.