
కరాచీ పోలీస్ చీఫ్ ఆఫీసులోకి చొరబడ్డ టెర్రరిస్టులు
ఓ పోలీసు, పౌరుడు, ఇద్దరు టెర్రరిస్టులు సహా నలుగురి మృతి
కరాచీ : పాకిస్తాన్లోని కరాచీలో శుక్రవారం టెర్రర్ దాడిజరిగింది. బాంబులు, ఆయుధాలతో పన్నెండు మంది టెర్రరిస్టులు పోలీస్ చీఫ్ ఆఫీసులోకి చొరబడ్డారు. ఐదంతుస్తుల భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందుకున్న భద్రతాబలగాలు అక్కడికి చేరుకొని పోలీస్ బాస్ ఆఫీసును చుట్టుముట్టాయి. టెర్రరిస్టుల ఏరివేతకు ఆర్మీ స్నిఫర్లను రంగంలోకి దించింది. శుక్రవారం అర్ధరాత్రి వరకూ ఇరువైపులా కాల్పులు జరుగుతూనే ఉన్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. టెర్రరిస్టులంతా సూసైడ్ బాంబర్లేనని, అందుకే జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తోందని పేర్కొన్నారు. అర్ధరాత్రి వరకు మూడు అంతస్తులను తమ కంట్రోల్ లోకి తెచ్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఓ పోలీసుతో పాటు పౌరుడు, ఇద్దరు టెర్రరిస్టులు.. మొత్తం నలుగురు చనిపోయారని ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, కరాచీ పోలీస్ చీఫ్ ఆఫీసులో దాడి తమ పనేనని తెహ్రిక్ ఏ తాలిబన్(టీటీపీ) ప్రకటించుకుంది.