వీడు మామూలోడు కాదు : సీసీ కెమెరా పగలకొట్టి ATM చోరీ

వీడు మామూలోడు కాదు : సీసీ కెమెరా పగలకొట్టి ATM చోరీ

ఏటీఎం సెంటర్ ను ఏ మాత్రం భయంలేకుండా కొల్లగొట్టాడు ఓ దొంగ. మహారాష్ట్రలోని పాల్ఘర్ లో జరిగిందీ సంఘటన. ఓ బ్యాంక్ ఏటీఎంలోకి అర్ధరాత్రి దాటిన తర్వాత 3గంటల టైమ్ లో ప్రవేశించాడు ఓ దొంగ. సీసీ కెమెరాల్లో రికార్డైతే అందరూ గుర్తుపడతారని.. తనను ఎవరూ గుర్తుపట్టకుండా డేంజరస్ ప్లాన్ వేశాడు.

తలకు మొత్తం బట్ట కట్టుకుని… కళ్లకు అద్దాలు పెట్టుకుని… ఎవరూ గుర్తుపట్టనిలేని విధంగా తయారై ఏటీఎంలోకి వచ్చాడు. తాను వెంట తెచ్చుకున్న వస్తువులతో ముందు అందులోని సీసీ కెమెరాలను పగలగొట్టాడు. సీసీ కెమెరాల కేబుల్స్ ను తెంపేశాడు. తెల్లవారుజామున ఆ ఏటీఎంకు వచ్చిన వారు.. దొంగతనం జరిగిన సంగతి గుర్తించి బ్యాంక్ అధికారులకు చెప్పారు. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ ను గుర్తించినప్పుడు.. దొంగ ఎలా వాటిని ధ్వంసం చేశాడన్నది తెలిసింది. అతడి బాడీ లాంగ్వేజ్ .. నగరంలోని మిగతా సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామన్నారు పోలీసులు. దొంగ కోసం వెతుకుతున్నారు.