స్టూడెంట్​ బిల్డింగ్​ పైనుంచి దూకిన విద్యార్థి

స్టూడెంట్​ బిల్డింగ్​ పైనుంచి దూకిన విద్యార్థి

సంగారెడ్డి, వెలుగు : బ్యాక్​లాగ్​ ఎగ్జామ్స్​ రాయడానికి వచ్చి ఓ ఐఐటీ ఓల్డ్​ స్టూడెంట్​ బిల్డింగ్​ పైనుంచి దూకి సూ సైడ్​ చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్​లో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. సంగారెడ్డి డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... రాజస్థాన్​లోని జోధ్ పూర్​కు చెందిన మేఘ్ కపూర్ హైదరాబాద్ ఐఐటీలో బీటెక్ పూర్తి చేశాడు. ఎంటెక్ మెకానికల్​కు సంబంధించి బ్యాక్ లాగ్ సబ్జెక్టులు రాసేందుకు సంగారెడ్డి పట్టణ శివారులో పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని ఓ లాడ్జీలో నెల రోజులుగా ఉంటున్నాడు. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు లాడ్జి నాలుగో ఫ్లోర్​ నుంచి దూకగా స్పాట్​లోనే చనిపోయాడు.

పోలీసులు బాడీని సంగారెడ్డి గవర్నమెంట్​ హాస్పిటల్​కు తరలించి, అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బుధవారం సాయంత్రం ఆసుపత్రికి చేరుకున్న తల్లిదండ్రులు కొడుకు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. తండ్రి ఫిర్యాదు మేరకు సంగారెడ్డి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేఘ్ కపూర్​ది ఆత్మహత్యే అని సంగారెడ్డి డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. అయితే సూసైడ్​కు కారణాలు  తెలియాల్సి ఉందన్నారు.