పిడుగుపడి పశువులు మృతి

పిడుగుపడి పశువులు మృతి

పాల్వంచ రూరల్, వెలుగు: పిడుగుపడి ఆవు, ఎద్దు మృతి చెందిన ఘటన శుక్రవారం పాల్వంచలో జరిగింది. పాల్వంచ పట్టణంలోని భోజ్యాతండా గ్రామానికి చెందిన ధర్మసోత్​ బాలకృష్ణ, రాంబాబులకు చెందిన 10 పశువులు శుక్రవారం ఉదయం మేతకు వెల్లాయి. సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం రావడంతో వేపచెట్టు కిందకు చేరాయి. చెట్టుపై పిడుగు పడటంతో ఆవు, ఎద్దు మృతి చెందగా, మిగిలిన పశువులు సొమ్మసిల్లిపడ్డాయి.