క్లాస్​రూమ్​లో ఉరేసుకున్న ఇంటర్​ స్టూడెంట్​

క్లాస్​రూమ్​లో ఉరేసుకున్న ఇంటర్​ స్టూడెంట్​
  • తండ్రికి ఆలస్యంగా  సమాచారం ఇచ్చిన సిబ్బంది
  • స్టాఫ్​ తీరు వల్లే చనిపోయాడంటూ కుటుంబసభ్యుల ఆందోళన
  • మహబూబ్​నగర్ లోని మైనార్టీ గురుకుల స్కూల్ లో ఘటన

పాలమూరు/మద్దూరు, వెలుగు : మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల స్కూల్​లో ఓ ఇంటర్ స్టూడెంట్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఈ సమాచారాన్ని ఆలస్యంగా కుటుంబసభ్యులకు చేరవేయడంతో వారు కాలేజీలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం భునీడ్​గ్రామానికి చెందిన ముదేలి హన్మంత్ రెడ్డి, లక్ష్మి దంపతుల కొడుకు రామ్​రెడ్డి (17)  మహబూబ్​నగర్ ​న్యూ టౌన్​ లోని మైనార్టీ గురుకుల స్కూల్ లో ఇంటర్​ సెకండియర్​  చదువుతున్నాడు. ఆదివారం రాత్రి స్టూడెంట్లు స్కూల్ పై ఫ్లోర్ లోని డార్మెట్రీ రూమ్ లో పడుకున్నారు. సోమవారం ఉదయం సిబ్బంది క్లాస్​రూమ్​లోకి వెళ్లి చూడగా రామ్​రెడ్డి టవల్ తో ఉరేసుకుని కనిపించాడు. వెంటనే అతడిని కిందకు దింపి మహబూబ్​నగర్​జనరల్​ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. అప్పటికే  అతడు చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. దీంతో రామ్​రెడ్డి తండ్రికి ఫోన్​ చేసిన సిబ్బంది రామ్​రెడ్డి ఆరోగ్యం బాగోలేదని చెప్పారు.

కుటుంబంతో కలిసి వెళ్లగా  తల్లి ఆరోగ్యం బాగోలేదని బెంగ పెట్టుకొని రామ్ రెడ్డి సూసైడ్​ చేసుకున్నట్లు చెప్పారు. దీంతో అతడు తన భార్యకు 25 రోజుల కింద చిన్న ఆపరేషన్ ​జరిగిందని.. ప్రస్తుతం ఆమె బాగానే ఉందని, తన కొడుకు ఎలా చనిపోయాడో చెప్పాలని నిలదీశాడు. తర్వాత తన కొడుకు మృతికి స్కూల్ సిబ్బందే కారణమని ధర్నాకు దిగారు. స్టూడెంట్​యూనియన్​ లీడర్లు కూడా ఆందోళన చేశారు. ఈసందర్భంగా కాలేజీలోని ఫర్నిచర్​ను ధ్వంసం చేశారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పినా వినలేదు. చివరకు  కేసు నమోదు చేసి, విచారణ చేస్తామని డీఎస్పీ మహేశ్ గౌడ్ హామీ ఇవ్వగా ధర్నా విరమించారు.