హైదరాబాద్, వెలుగు: కేరళకు చెందిన టీ కేఫ్ చైన్ క్లబ్ సులైమాని హైదరాబాద్‌లోని లులు మాల్‌లో బుధవారం ఔట్‌లెట్‌ను తెరిచింది. దీనిని లులు గ్రూప్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రెజిత్ రాధాకృష్ణన్, ఫెమీనా మిస్ ఇండియా తెలంగాణ -2023 ఊర్మిలా చౌహాన్, క్లబ్ సులైమాని ఫౌండర్ మహమ్మద్ షఫీ ప్రారంభించారు. ఈ టీ కేఫ్ చైన్ క్లబ్ వినూత్న పద్దతిలో కస్టమర్లకు సేవలు అందిస్తుంది. ఎవరైనా కస్టమర్లు ఎక్కువ డబ్బులు చెల్లిస్తే వారి పేరును అక్కడ డిస్ ప్లేలో ప్రకటిస్తారు.
ఆ డబ్బుతో ఉద్యోగులకు గానీ, స్టూడెంట్లకు గానీ ఉచితంగా కాఫీ అందిస్తారు. క్లబ్ సులైమానీ తన 15 అవుట్‌లెట్‌ల ద్వారా ప్రతి నెలా లక్ష మందికి 51 రకాల టీలు అందిస్తోంది. దీనికి అన్ని ప్రముఖ నగరాల్లో ఔట్లెట్లు ఉన్నాయి. ఇటీవల కే పాప్బబుల్ టీ, నట్టీ టారో బబుల్ టీ, పినాకొలాడా బబుల్ టీలను అందుబాటులోకి తెచ్చింది. డైనమిక్ చికెన్, డైనమిక్ ష్రింప్స్, చికెన్ క్లబ్శాండ్విచ్, చికెన్బర్గర్ వంటి స్నాక్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి.