వర్లి శ్మాశనవాటికలో మిస్త్రీ అంత్యక్రియలు

వర్లి శ్మాశనవాటికలో మిస్త్రీ అంత్యక్రియలు

ముంబై: రోడ్డు ప్రమాదంలో మరణించిన బిజినెస్ టైకూన్, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ అంత్యక్రియలు మంగళవారం ముంబైలో జరగనున్నాయి. సిటీలోని వర్లి శ్మాశనవాటికలో ఉదయం 11 గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆదివారం ముంబై–అహ్మదాబాద్ నేషనల్ హైవేపై కారు డివైడర్ ను ఢీకొట్టడంతో అందులో ఉన్న మిస్త్రీతోపాటు ఆయన ఫ్రెండ్ జహంగీర్ పండోల్ చనిపోగా, ఇద్దరి డెడ్ బాడీలను ముంబైలోని జేజే హాస్పిటల్ మార్చురిలో ఉంచారు. రోడ్డు ప్రమాదం సమయంలో కారును డ్రైవ్ చేస్తున్న డాక్టర్ అనాహిత పండోల్, ఆమె భర్త దరియస్ పండోల్ తీవ్రంగా గాయపడగా, ప్రస్తుతం సిటీలోని రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.