Anasuya: ఒక్కొక్కడికీ "చెప్పు తెగుద్ది".. పబ్లిక్ మీటింగ్ లో వార్నింగ్ ఇచ్చిన అనసూయ

Anasuya: ఒక్కొక్కడికీ "చెప్పు తెగుద్ది".. పబ్లిక్ మీటింగ్ లో వార్నింగ్ ఇచ్చిన అనసూయ

ప్రముఖ నటి , యాంకర్ అనసూయ భరద్వాజ్( Anasuya Bharadwaj ) కు ఆంద్రప్రదేశ్ లోని మార్కాపరుంలో చేదు అనుభవం ఎదురైంది.  ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి అతిథిగా హాజరైన అనసూయ, వేదికపై మాట్లాడుతున్న సమయంలో కొందరు ఆకతాయిలు అనుచిత వ్యాఖ్యలు  చేశారు. దీంతో ఆ యువకులపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తనను ఉద్దేశించి కాకుండా, సమాజంలో మహిళల పట్ల ప్రదర్శిస్తున్న అగౌరవాన్ని ఆమె గట్టిగా ప్రశ్నించారు.

అనసూయ కోపంతో వారిని ఉద్దేశించి గట్టిగా హెచ్చరించారు. "చెప్పు తెగుద్ది" అని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. మీ ఇంట్లో అమ్మ, చెల్లి, భార్యపై ఇలాగే కామెంట్లు చేస్తే మీరు ఊరుకుంటారా?  మీ ఇంట్లో వాళ్లను ఇలాగే అవమానిస్తే మీరు ఊరుకుంటారా? అని ప్రశ్నిస్తూ, మర్యాద తప్పిన వారిని నిలదీశారు. మీ ఇంట్లో వాళ్లను ఇలాగే ఏడిపిస్తే మీకు నచ్చుతుందా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వడం మీ ఇంట్లో నేర్పలేదా?" అని ప్రశ్నించారు.   

అనసూయ తన వ్యాఖ్యలలో కేవలం కోపాన్ని మాత్రమే కాకుండా, బాధను కూడా వ్యక్తం చేశారు. మీలాంటి వాళ్లు ఇక్కడికి రానవసరం లేదు. ఇప్పుడే ఇలా ఉన్నారంటే.. పోనుపోను ఎలా ఉంటారు? మీలాంటి వారితో సమాజానికి లాభం లేదు. ఇలాంటి కార్యక్రమాలకు రానవసరం లేదంటూ ఆగ్రహం వ్యకం చేశారు. తాను చాలా ఇష్టంతో, ఎంతో దూరం ప్రయాణం చేసి ప్రజల కోసం ఈ కార్యక్రమానికి వచ్చానని, ఇలాంటి ప్రవర్తన సరికాదని ఆమె హితవు పలికారు.

►ALSO READ అదో పనికి మాలిన సినిమా.. బీజేపీ ఎజెండాలో భాగంగానే అవార్డ్ : సీఎం సంచలన కామెంట్స్

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అనసూయకు మద్దతుగా చాలామంది నిలిచారు. పబ్లిక్ ఈవెంట్లలో సెలబ్రిటీల పట్ల ఇలాంటి అసభ్యకర ప్రవర్తన సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సెలబ్రిటీలు కూడా మనుషులే అని, వారికి గౌరవం ఇవ్వాలని అనసూయ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని ఆమె అభిమానులు పేర్కొంటున్నారు. ఈ సంఘటన మహిళల పట్ల మర్యాదతో ఎలా ప్రవర్తించాలనే దానిపై మరోసారి చర్చకు దారితీసింది .