నాగశౌర్య హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు.
ఇప్పటికే రెండు పాటలను విడుదల చేయగా, సోమవారం థర్డ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. హారిస్ జయరాజ్ కంపోజ్ చేసిన రొమాంటిక్ సాంగ్‌కు కృష్ణకాంత్ ఆకట్టుకునే లిరిక్స్ అందించాడు. శ్రీధర్ సేన, ప్రియా జెర్సన్ పాడిన తీరు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
‘అందమైన ఫిగర్ నువ్వా.. డే టైమ్‌లో డెవిల్ నువ్వా.. ఓకే అంటూ కలిసిపోవా.. పొగరెక్కిన మిరపకాయ.. అమ్మడు మా లచ్చి నీకుంది బొలేడు పిచ్చి.. ఇక చుక్కలనే తెచ్చి మరి మాల చుడతా గుచ్చి.. ’ అంటూ సాగిన పాటలో హీరోయిన్ విధి చుట్టూ తిరుగుతూ తనను ప్రేమలో దించడానికికి నాగశౌర్య ప్రయత్నిస్తూ కనిపించాడు.
ఇద్దరూ స్టైలిష్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సముద్రఖని, వీకే నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, అజయ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా, త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని దర్శక నిర్మాతలు తెలియజేశారు.
