ఏపీ ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఏపీ ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఏపీ సర్కార్ నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు పోస్టులకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను రిలీజ్ చేస్తుంది.. తాజాగా ప్రభుత్వం వైద్య శాఖలో ఉన్న ఖాళీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో 331 స్పెషలిస్ట్ డాక్టర్ భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం శ్రీనివాసరావు ఈ ఉద్యోగాలకు సబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేశారు. 14 పోస్టులకు సంబంధించి  డాక్టర్ల నియామకానికి జులై 5, 7, 10 తేదీల్లో ప్రత్యక్ష నియామకాలు చేపపట్టనున్నట్లు తెలిపారు. రెగ్యులర్, కాంట్రాక్ట్ విధానంలో గిరిజన, గ్రామీణ ఆస్పత్రుల్లో పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అభ్యర్థులు.. విజయవాడ, గొల్లపూడి లో ఉన్న ఏపీవివిపీ కమీషనర్ కార్యాలయంలో వాకిన్ రిక్రూట్మెంట్‌కు  హాజరు కావాలి..

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాల కోసం cfw.ap.nic.in, hmfw.ap.gov.in వెబ్సైట్‌ల లో చూడొచ్చని తెలిపారు. ఇతర వివరాల కోసం 06301138782 ఫోన్ నంబరుకు గానీ, apvvpwalkinrecruitment@gmail.com ఇమెయిల్ కు గానీ సంప్రదించాలని సూచించారు. తాజా నియామకాల్లో కాంట్రాక్ట్ పోస్టులకు స్థానికత, రోస్టర్ విధానంలో ప్రభుత్వం సడలింపు ఇచ్చిందని ఆయన తెలిపారు.  ఇప్పటికే ఏడాది లో విడుదల చేసిన ఉద్యోగాలకు మంచి స్పందన వచ్చిందని ఇప్పుడు నోటిఫికేషన్ కు కూడా మంచి స్పందన వస్తుంది ఆయన అన్నారు.. భవిష్యత్ లో మరిన్ని పోస్టులను భర్తీ చేస్తామని  తెలిపారు..