
బాన్సువాడ, వెలుగు : తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని కోరుతూ బుధవారం బాన్సువాడ ఐసీడీఎస్ కార్యాలయం ముందు అంగన్వాడీ ఉద్యోగులు చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ లీడర్లు మాట్లాడుతూ అంగన్వాడీలకు తీపి కబురు అంటూ మంత్రి సత్యవతి రాథోడ్ గతంలోనే ఒప్పుకున్న హామీలకు ఇప్పుడు జీవోలు ఇచ్చి, తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
అంగన్వాడీల్లో కనీస సౌకర్యాలు లేక స్టూడెంట్స్, గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దేశంలో అన్నింటా అగ్రస్థానంలో ఉన్నామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వానికి అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనాలు చెల్లించే సోయి లేదన్నారు. కార్యక్రమంలో యూనియన్ లీడర్లు మహాదేవి, శివగంగ, విజయ, బాలమణి, సరిత, రేణుక, ఇందిర, అరుణ పాల్గొన్నారు.