
ప్రేమ కోసం ఆత్మహత్య చేసుకున్నోళ్లం చూసుంటారు, లేదా కోపంతో దాడి చేయడం చూసుంటారు... కానీ ఈ విధంగా ఊరంతా ఆశ్చర్యపోయి విమర్శించేలా ఎవరు చేసి ఉండరు. ఇదేదో సినిమాలో స్టయిల్లో చూసి చేసింది కాదు, ఒకరు చెప్తే చేసింది కూడా కాదు... అసలు విషయం ఏంటంటే...
తన గర్ల్ ఫ్రెండ్ ఫోన్ బిజీగా వస్తుందని కోపంతో కరెంట్ స్తంభంపై ఎక్కి ఏకంగా కరెంట్ వైర్లను కత్తిరించిన యువకుడి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ విచిత్రమైన సంఘటన ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక వ్యక్తి కోపంతో ఊరు మొత్తం కరెంట్ పోయేలా చేయడంపై నెటిజన్లు రకాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ALSO READ : వరంగల్ జిల్లాలో 723 కిలోల గంజాయి స్వాధీనం..
కొంతమంది దీనిని చూసి ఇదంతా సినిమా ఎఫెక్ట్ అంటుండగా, మరికొంతమంది పిచ్చి బాగా ముదిరిందని అంటున్నారు. చిన్న విషయానికి బ్రేకప్ చెప్పడం, గొడవ పాడడం వంటి సంఘటనలు చూసుంటాం కానీ ఇలా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ బిజీ వస్తుందని కోపాన్ని తట్టుకోలేక వల్ల ఊరు మొత్తం కరెంట్ పోయేలా చేయడం ఏంటని ఇంకొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియోలో ఓ యువకుడు కరెంట్ స్తంభంపైకి ఎక్కి వైర్లను కత్తిరించడానికి కట్టర్ తో ఒక్కొక్క కరెంట్ వైరును కట్ చేస్తుండటం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ యువకుడు చేసిన పనికి కొందరు నెటిజన్లు కూడా ఆశ్చర్యపోయి వ్యక్తిగత కోపంతో ఊరి మొత్తం కరెంట్ పోయేలా చేయడం ఏంటని ప్రశ్నిస్తూ విమర్శించారు. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనేది తెలియరాలేదు.