కూలర్‌‌‌‌ ప్లగ్‌‌‌‌పెడుతూ యువకుడు‌‌ మృతి

కూలర్‌‌‌‌ ప్లగ్‌‌‌‌పెడుతూ యువకుడు‌‌ మృతి

బెల్లంపల్లి, వెలుగు : కూలర్‌‌‌‌ ప్లగ్‌‌‌‌ పెడుతుండగా కరెంట్‌‌‌‌ షాక్‌‌‌‌ కొట్టి ఓ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం తాళ్ల గురిజాలలో జరిగింది. తాళ్లగురిజాల గ్రామానికి బొమ్మగోని అనిల్‌‌‌‌ గౌడ్‌‌‌‌ (28) మంగళవారం రాత్రి కూలర్‌‌‌‌ ప్లగ్‌‌‌‌ను జంక్షన్‌‌‌‌ బాక్స్‌‌‌‌లో పెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కరెంట్‌‌‌‌ షాక్‌‌‌‌ కొట్టడంతో స్పాట్‌‌‌‌లోనే చనిపోయాడు. 

విద్యుత్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ఎదుట ధర్నా

హైవోల్టేజ్‌‌‌‌ విద్యుత్‌‌‌‌ సరఫరా కావడం వల్లే అనిల్‌‌‌‌ చనిపోయాడని, బాధ్యులైన విద్యుత్‌‌‌‌ శాఖ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌‌‌ చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులు బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని విద్యుత్ శాఖ రూరల్ ఏఈ ఆఫీస్‌‌‌‌  ఎదుట ధర్నాకు దిగారు. నాలుగు రోజులుగా తమ గ్రామానికి టూ ఫేజ్‌‌‌‌ విద్యుత్‌‌‌‌ సరఫరా అవుతుందని ఏఈ, లైన్‌‌‌‌ఇన్స్‌‌‌‌పెక్టర్‌‌‌‌, లైన్‌‌‌‌మెన్‌‌‌‌కు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. 

వారి నిర్లక్ష్యం వల్లే అనిల్‌‌‌‌ చనిపోయాడన్నారు. మృతుడి ఫ్యామిలీకి రూ. 10 లక్షల ఎక్స్‌‌‌‌ గ్రేషియా చెల్లించాలని, నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌‌‌ చేశారు. విషయం తెలుసుకున్న బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, రూరల్ సీఐ అఫ్జలొద్దీన్, తాళ్ల గురిజాల ఎస్సై జి.నరేశ్‌‌‌‌ విద్యుత్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ వద్దకు చేరుకొని బెల్లంపల్లి డీఈ రాజన్న, ఏడీఈ శ్రీనివాస్‌‌‌‌ను పిలిపించారు. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా ఆందోళన విరమించలేదు.