భగవంత్ కేసరి మూవీ చూసి ఎమోషన్స్‌‌కు కనెక్ట్ అవుతున్నారు : అనిల్ రావిపూడి

భగవంత్ కేసరి మూవీ చూసి ఎమోషన్స్‌‌కు కనెక్ట్ అవుతున్నారు : అనిల్ రావిపూడి

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి రూపొందించిన చిత్రం ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్, శ్రీలీల కీలకపాత్ర పోషించారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం గురువారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా శానా యేండ్లు యాదుంటాది’ అని ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పుడే చెప్పాం. అది ఈ రోజు నిజం చేశారు. చాలా సంతోషంగా ఉంది.

ఒక దర్శకుడిగా  సంపూర్ణమైన తృప్తిని ఇచ్చింది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. సినిమాలో చూపించిన హ్యూమన్ ఎమోషన్స్, తండ్రి బిడ్డ మధ్య అనుబంధానికి అందరూ కనెక్ట్ అవుతున్నారు.  ఆడపిల్లని సింహాంలా పెంచాలనే ఒక మంచి కంటెంట్ జనాల్లోకి వెళ్ళడం ఆనందంగా ఉంది’ అని చెప్పాడు. ఈ విజయంతో తనను చూసే విధానం మారింది అని చెప్పింది శ్రీలీల.  రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌‌తో సక్సెస్ ఫుల్‌‌గా రన్ అవుతోంది అన్నారు నిర్మాత సాహు గారపాటి. ఈ విజయంలో భాగమవడం ఆనందంగా ఉంది అని లిరిసిస్టులు రామ జోగయ్య శాస్త్రి,  అనంత శ్రీరామ్ అన్నారు.