
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ‘స్పిరిట్’ చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులతోపాటు నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రంలో హీరోయిన్గా త్రిప్తి డిమ్రిని సెలెక్ట్ చేయగా, తాజాగా మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరు తెరపైకొచ్చింది. రీసెంట్ టైమ్స్‌లో బాలీవుడ్, టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న కన్నడ నటుడు ఉపేంద్ర లిమాయే ఇందులో కీలక పాత్ర పోషించబోతున్నట్టు సమాచారం.
రీసెంట్గా హైదరాబాద్‌లోని సందీప్ రెడ్డి ఆఫీస్‌కు వచ్చిన ఉపేంద్ర.. తనతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘యానిమల్’ సినిమాతో ఉపేంద్రకు జాతీయ స్థాయిలో గుర్తింపును అందించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ‘స్పిరిట్’ చిత్రంలోనూ ఓ కీలకపాత్రకు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
ఇటీవల జైలర్, సంక్రాంతికి వస్తున్నాం, జాట్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో తన నటనతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు ఉపేంద్ర. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, మురాద్ ఖేతానీ నిర్మిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది