విజిల్తో మ్యూజిక్ అదరగోట్టేసిన సందీప్.. ఫిదా అవుతున్న నెటిజన్స్

విజిల్తో మ్యూజిక్ అదరగోట్టేసిన సందీప్.. ఫిదా అవుతున్న నెటిజన్స్

సందీప్ రెడ్డి వంగ(Sandeep reddy vanga).. ప్రస్తుతం ఇది పేరు కాదు ఒక బ్రాండ్. హీరోలకు యాటిట్యూడ్ పెట్టి, వైలెంట్ కంటెంట్ తో తనదైన స్టైల్లో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నారు ఈ దర్శకుడు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ మొన్నొచ్చిన యానిమల్.. ఇలా ఏ సినిమా చూసినా హీరోల పాత్రలు చాలా బిన్నంగా ఉంటాయి. హీరోల యాటిట్యూడ్ తో హాయ్ రేంజ్ కిక్కిస్తున్నాడు సందీప్. ఇక యానిమల్ సినిమా అయితే బాక్సాఫీస్ దగ్గర రూ.850 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 

ఈ సినిమా విజయంలో హీరోగా రణ్బీర్ పాత్ర ఎంతవుందో.. అంతకన్నా ఎక్కువ పాత్ర సందీప్ రెడ్డి వంగది ఉందని చెప్పాలి. సినిమా విషయానికి వస్తే.. ప్రతీది ఆయన దగ్గరుండి చూసుకుంటారు సందీప్. అందుకే ఆయన సినిమాలకు సపరేట్ లుక్ అండ్ ప్రెజెంటేషన్ ఉంటుంది. అంతలా సినిమా కోసం తన ప్రాణం పెట్టేస్తాడు సందీప్. తాజాగా సినిమా పట్ల ఆయనకున్న డెడికేషన్ ను ప్రూవ్ చేస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.     

ఆ వీడియో ఏంటంటే.. యానిమల్ సినిమాలో హీరో అక్కని కొందరు ఏడిపించారని వారికి వార్నింగ్ ఇస్తాడు. అనంతరం కాలేజ్ బయటకు వచ్చాక హీరో కారుని ఫాలో అయ్యి బెదిరించే ప్రయత్నం చేస్తారు కానీ.. రణ్బీర్ మాత్రం తన కారుతో వాళ్లను ఢీకొడతాడు. ఆ సమయంలో కిందపడిపోయిన వాళ్ళు ఒక ఓపెన్ ప్లేస్ లోకి పారిపోతారు. చాలా పవర్ ఫుల్ గా ఉండే ఈ సీన్ సమయంలో వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక విజిల్ వినిపిస్తూ వచ్చే ఈ మ్యూజిక్ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంది. అయితే.. ఆ విజిల్ వేసింది మరెవరో కాదు సందీప్ రెడ్డి వంగానే. 

ఆ రికార్డింగ్ కు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. సందీప్ ప్రాక్టీస్ చేసి మరీ దానిని రికార్డు చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ సందీప్ రెడ్డి వంగా డెడికేషన్ కి, మ్యూజిక్ సెన్స్ కి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఆయన సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతున్నాయి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.