ఏంటి ఆ ఫైట్ ఒరిజినల్ కాదా.. ఏంటి సందీప్ నువ్వు కూడానా?

ఏంటి ఆ ఫైట్ ఒరిజినల్ కాదా.. ఏంటి సందీప్ నువ్వు కూడానా?

కబీర్ సింగ్(Kabir singh) వైలెంట్ సినిమా అంటున్నారు కదా.. అసలు వైలెన్స్ అంటే ఎలా ఉంటుందో నా నెక్స్ట్ సినిమాలో చూపిస్తా.. ఇది దర్శకుడు సందీప్ రెడ్డి వంగ(Sandeep reddy Vanga) బాలీవుడ్ మీడియాతో చెప్పిన మాట. అన్నట్టుగానే వైలెన్స్ ను చాలా దగ్గరగా చూపించి ఆడియన్స్ మైండ్ పోగొట్టాడు దర్శకుడు సందీప్. ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. విడుదలై వారం పైనే అయినా.. కలెక్షన్స్ మాత్రం అస్సలు తగ్గడంలేదు. కేవలం పది రోజుల్లోనే ఏకంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది యానిమల్. 

అయితే ఈ సినిమాలో సందీప్ డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ మాస్ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ లో వచ్చే ఫైట్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది. చేతిలో గొడ్డలి పట్టుకొని ఒక్కొక్కరిని నరికే సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే ఈ ఫైట్ సీన్ కాపీ అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మలయాళంలో 2010లో నాయకన్ అనే సినిమా వచ్చింది. ఇంద్రజిత్ సుకుమారన్ హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో తండ్రిని, సోదరిని కోల్పోయిన హీరో విలన్ పై పగ తీర్చుకోవడానికి రంగంలోకి దిగుతాడు. క్లైమాక్స్ లో విలన్ డెన్ కు వెళ్లి విలన్ గ్యాంగ్ తో భారీ ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ సీక్వెన్స్ సరిగ్గా యానిమల్ ఇంటర్వెల్ ఫైట్ లాగే ఉంటుంది. 

అయితే నాయకన్ సినిమా తెలుగులో గానీ, హిందీలో గానీ రీమేక్ అవలేదు. కాబట్టి ఈ ఫైట్ సీక్వెన్స్ ఎక్కడ లీక్ అవ్వలేదు. దాంతో యానిమల్ సినిమాలో వాడేసాడు దర్శకుడు సందీప్. అయితే ఈ వార్త తెలుసుకున్న ఆడియన్స్.. ఏంటి సందీప్ భయ్యా ఇది. నువ్వు కేసుల ఇలా కాపీ చేస్తే ఎలా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తలపై సందీప్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.