ఆడియన్స్ గెట్ రెడీ ఫర్ వైల్డ్ రైడ్.. యానిమల్ OTTకి వచ్చేది రేపే!

ఆడియన్స్ గెట్ రెడీ ఫర్ వైల్డ్ రైడ్.. యానిమల్ OTTకి వచ్చేది రేపే!

యానిమల్(Animal) మూవీ ఓటీటీ రిలీజ్ కు సర్వం సిద్ధమైంది. ఆడియన్స్ ఎదురుచూపులకు ఎండ్ కార్డు పడే సమయం వచ్చేసింది. రేపటి నుండే(జనవరి 26) ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అంటే జనవరి 25 అర్ధరాత్రి 12 గంటల తరువాత నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలుకానుంది. నిజానికి గత వారం రోజులుగా యానిమల్ సినిమా ఓటీటీ రిలీజ్ పై సందిగ్ధం నెలకొంది. మేకర్స్ మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా కోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది.

దీంతో.. యానిమల్ సినిమా ఓటీటీ రిలీజ్ ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు నెలకొన్నాయి. కానీ, ఆ వివాదం సద్దుమణగండంతో ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది ఈ మూవీ. ముందుగా అనుకున్నట్లుగానే జనవరి 26 నుండి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో యానిమల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇక యానిమల్ సినిమా విషయానికి వస్తే.. సౌత్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ(Sandeep reddy vanga) బాలీవుడ్ లో తెరకెక్కించిన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ హిట్ సాధించింది. బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్(Ranbir kapoor), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) జంటగా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కేవలం రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు రూ.900 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. మరి థియేటర్స్ లో భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.