Animal X Review: యానిమల్ వైల్డ్ అండ్ ఎమోషనల్ రైడ్.. అరాచకానికి కేరాఫ్

Animal X Review: యానిమల్ వైల్డ్ అండ్ ఎమోషనల్ రైడ్.. అరాచకానికి కేరాఫ్

అర్జున్‌రెడ్డి(Arjun Reddy) మూవీతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ(Sandeepreddy Vanga). అదే సినిమాను బాలీవుడ్ లో కబీర్‌సింగ్‌(Kabir singh) పేరుతో రీమేక్ చేసి మరో వైల్డ్ హిట్ అందుకున్నాడు. అలాంటి డెనిమిక్ డైరెక్టర్ సందీప్‌ నుండి చాలా గ్యాప్‌ తరువాత వస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్. 

బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్‌ కపూర్‌, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా వచ్చిన ఈ సినిమాపై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్‌ తో ఆ అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ట్రైలర్ అరాచకంగా ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేశారు. ఫైనల్ గా యానిమల్ మూవీ నేడు(డిసెంబర్‌ 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటుగా చాలా చోట్ల ఫస్ట్‌ షోస్ పడిపోవడంతో.. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. మరి యానిమల్ సినిమా ఎలా ఉంది? సందీప్ ఎలాంటి మ్యాజిక్ చేశారు? రణ్బీర్ ఏమేరకు మెప్పించాడు? అనేదానిపై ప్రేక్షకులు ఏమంటున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

యానిమల్‌ సినిమాకు సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఎక్కువ మంది సినిమా చాలా బాగుందని  చెబుతున్నారు. రణ్‌బీర్‌, రష్మిక, బాబీ డియోల్‌, అనిల్‌ కపూర్ ల నటన సూపర్ గా ఉందని, సినిమా ఒక ఎమోషనల్ రైడ్ అని చెబుతున్నారు. మరి కొందరేమో సినిమాలో వయోలెన్స్‌ ఎక్కువైందని, సందీప్ ముందు చెప్పినట్టుగానే వైలెన్స్ అంటే ఏంటో క్లియర్ గా చూపించాడని, మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ సినిమాకె హైలెట్ అని కామెంట్స్ చేస్తున్నారు.
  
ఇంకొందరేమో.. యానిమల్ మూవీ ఫస్టాఫ్‌ చాలా బాగుంది. రణ్బీర్  కపూర్‌ అదరగొట్టేశాడు. ఆయన్ని ఇలాంటి మాస్ అండ్ యాటిట్యూడ్ పాత్రలో ఎప్పుడు చూడలేదు. సందీప్‌ వంగ టేకింగ్ అరాచకం అని అంటున్నారు. ఇక ఫైనల్ గా సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. యానిమల్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ. 1000 కోట్లు ఆన్ ది వే అనేది క్లియర్.