ఈ బుడ్దోడే రజనీకి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు.. ఎవరో గుర్తుపట్టారా?

ఈ బుడ్దోడే రజనీకి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు.. ఎవరో గుర్తుపట్టారా?

జైలర్(Jailer).. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా జైలర్ మ్యానియానే కనిపిస్తోంది. నెల్సన్ కుమార్(Nelson kumar) దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) హీరోగా వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే రూ.400 కోట్ల వసూళ్లు రాబట్టి రజనీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది జైలర్ మూవీ. 

ఈ సినిమా ఇంత భారీ విజయం సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించింది అంటే అనిరుధ్(Anirudh) మ్యూజిక్ అనే చెప్పాలి. రజని ఎలివేషన్స్ కు అనిరుధ్ ఇచ్చిన బీజీఎమ్ నెక్స్ట్ లెవల్లో వర్కౌట్ అయ్యింది. తన ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ తో సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకుళ్ళాడు అనిరుద్. మరీ ముఖ్యంగా ఈ మూవీలో 'హుకూం' సాంగ్‌ అయితే ఫుల్ ట్రెండ్‌ అవుతుంది. రజనీ కోసం అనిరుద్ కంపోజ్ చేసిన బీజీఎం ప్రేక్షకులకు గూస్‌బమ్స్‌ తెప్పించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 

నిజానికి అనిరుద్  జైలర్ సినిమాకు పడిన కష్టం కంటే బాధ్యతే ఎక్కువగా కనిపిస్తోంది. జైలర్ ఆడియో ఫంక్షన్లో దర్శకుడు విగ్నేష్ శివన్(Vignesh shivan) అనిరుద్ ను రజనీకాంత్ కొడుకుగా సంబోదించాడు. అది ఎదో స్టేజిపై చెప్పారని అందరూ అనుకున్నారు. కానీ వాస్తవంలో కూడా రజనీకాంత్, అనిరుద్ బంధువులు అవుతారట. తాజా సమాచారం ప్రకారం.. అనిరుద్ తండ్రి రవి రాఘవేంద్ర రజని భార్య లతకు మేనల్లుడు అవుతారట. అందుకే అనిరుద్ అంటే రజనికి ప్రత్యేక అభిమానం. దాదాపు ముప్పై ఏళ్ళక్రితం రజని వద్దకు అనిరుద్ ను తీసుకెళ్లారుట లతా. ఆ సమయంలో అనిరుద్ ను ఎత్తుకొని ఫోటో కూడా దిగారు రజనీకాంత్. ఆ ఫోటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటో చూసిన నెటిజన్స్  ఆ బుడ్డోడే ఇప్పుడు రజనీకాంత్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.