నేషనల్​ హెరాల్డ్​ కేసులో ఈడీ ముందుకు అంజన్​కుమార్

నేషనల్​ హెరాల్డ్​ కేసులో ఈడీ ముందుకు అంజన్​కుమార్

    
న్యూఢిల్లీ, వెలుగు: నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ ఎంపీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్​ను  ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం సుమారు 2 గంటల పాటు విచారించారు. యంగ్ ఇండియా ఫౌండేషన్  విరాళాలకు సంబంధించి పలు ప్రశ్నలు వేశారు. ఫౌండేషన్ కు విరాళంగా ఇచ్చిన రూ. 20 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయని, ఎవరి డైరెక్షన్ లో ఈ డబ్బులను విరాళంగా ఇచ్చారని అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది.

 ఇదే కేసులో నిరుడు నవంబర్​లోనూ అంజన్​ కుమార్​ ఈడీ ముందు హాజరయ్యారు.  ఇటీవల ఈడీ ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో బుధవారం ఢిల్లీలోని  ఈడీ హెడ్ ఆఫీసు ‘ప్రవర్తన్ భవన్’లో విచారణకు హాజరయ్యారు. అనంతరం అంజన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ... తానేమీ తప్పు చేయలేదని అన్నారు.