కేజ్రీవాల్ అరెస్ట్ పై అన్నాహజారే ఏమన్నారంటే.?

కేజ్రీవాల్ అరెస్ట్ పై అన్నాహజారే ఏమన్నారంటే.?

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పై సామాజిక కార్యకర్త అన్నాహజారే స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ తప్పుచేశారు  కాబట్టే అరెస్ట్ చేశారని అన్నారు.  కొత్త లిక్కర్ పాలసీ గురించి కేజ్రీవాల్ కు రెండుసార్లు లేఖలు రాసినా స్పందించలేదన్నారు. తన మాట వినకుండా ముందుకెళ్లారు..ఇపుడు ఆయనకు ఎటువంటి సలహా ఇవ్వలేనని చెప్పారు.   కేజ్రీవాల్ తన సొంత పనులకు  పాలసీలు తయారు చేశారని ఆరోపించారు. తనతో కలసి మద్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన కేజ్రీవాల్ లిక్కర్ పాలసీలు తయారు చేశారు..ఆయనతో కలిసి పనిచేసినందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు.  2012లో అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారేతో కలిసి కేజ్రీవాల్ ఉద్యమం చేసిన సంగతి తెలిసిందే..

మరో వైపు మార్చి 21న కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన ఈడీ ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టింది. కేజ్రీవాల్ ను 10 రోజుల కస్టడీ కోరింది.  మద్యం పాలసీతో   సౌత్ గ్రూప్ నుంచి వచ్చిన ముడుపులు రూ.45 కోట్లను కేజ్రీవాల్ గోవా ఎన్నికల్లో  వాడారని ఈడీ కోర్టులో వాదించింది.  ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ సూత్రధారి అని ..మద్యంపాలసీలో కేజ్రీవాల్ సౌత్ గ్రూపుకు అనుకూలంగా ఉన్నారని తెలిపారు. 

Also Read :అరెస్ట్ సవాల్ చేస్తూ వేసిన పిటీషన్లు వెనక్కి తీసుకున్న కేజ్రీవాల్