సెల్‌‌‌‌బేలో వార్షికోత్సవ ఆఫర్లు.. నెల రోజుల పాటు అందుబాటులో

సెల్‌‌‌‌బేలో వార్షికోత్సవ ఆఫర్లు..  నెల రోజుల పాటు అందుబాటులో

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: స్మార్ట్‌‌‌‌ఫోన్ రిటైలర్‌‌‌‌‌‌‌‌ సెల్‌‌‌‌బే మొబైల్స్ తమ 9వ వార్షికోత్సవం సందర్భంగా వినూత్న ఆఫర్లను ప్రకటించింది.   లక్కీ డ్రా ద్వారా విలువైన బహుమతులను గెలుచుకోవచ్చని చెబుతోంది.   సెల్‌‌‌‌బే మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్  కస్టమర్ల కోసం నెల రోజుల పాటు బంపర్ లక్కీ డ్రా ఈవెంట్‌‌‌‌ను నిర్వహించనుంది. 

ఇందులో గెలిచిన వారికి ఎలక్ట్రిక్ స్కూటర్, స్మార్ట్ టీవీలు, సౌండ్ బార్లు, ఇతర ఎన్నో విలువైన బహుమతులు ఇవ్వనున్నారు.  అంతేకాకుండా స్పెషల్ ఆఫర్లను కూడా సంస్థ ఇస్తోంది. రూ.20 వేలకు పైగా స్మార్ట్‌‌‌‌ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.9,999 విలువైన గిఫ్ట్‌‌‌‌లు, రూ.15 వేలకు పైగా స్మార్ట్‌‌‌‌ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.6,999 విలువైన గిఫ్ట్‌‌‌‌లు  ఉచితంగా సంస్థ ఇస్తోంది. 43 ఇంచుల స్మార్ట్ టీవీ కొంటె 32 ఇంచుల స్మార్ట్ టీవీ ఉచితంగా అందివ్వనుంది. 

అంతేకాదు కొనుగోళ్లపై 10శాతం వరకు క్యాష్‌‌‌‌బ్యాక్, ఈజీ ఈఎంఐ, అన్ని బ్యాంకు ఫైనాన్స్ సౌకర్యం కూడా  అందుబాటులో ఉన్నాయి. "గత తొమ్మిదేళ్లుగా మమ్మల్ని విశ్వసిస్తూ  మద్దతుగా నిలిచిన కస్టమర్లకు మా కృతజ్ఞతగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. ఇది కేవలం ఒక ఆఫర్ కాదు, మా ప్రయాణాన్ని కస్టమర్లతో కలిసి జరుపుకునే ఓ ప్రత్యేక క్షణం" అని సెల్‌‌‌‌బే ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది. ఈ ప్రత్యేక ఆఫర్లు ఒక నెలపాటు అన్ని  సంస్థ బ్రాంచుల్లో అందుబాటులో ఉంటాయి.