ఎస్టీపీపీ లో మరో 800 మెగా వాట్ థర్మల్ పవర్ ప్లాంట్: సత్యనారాయణ రావు

ఎస్టీపీపీ లో మరో 800 మెగా వాట్ థర్మల్ పవర్ ప్లాంట్: సత్యనారాయణ రావు

జైపూర్, వెలుగు :  సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్​లో త్వరలో మరో 800 మెగా వాట్ థర్మల్ పవర్ ప్లాంట్ అందుబాటులోకి రానున్నట్లు సింగరేణి ఈఅండ్ఎం డైరెక్టర్ సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం ఎస్టీపీపీలో జరిగిన జాతీయ ఇంజనీర్స్ డే కార్యక్రమంలో పాల్గొని మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

ALSO READ: హైదరాబాద్లో మరో అగ్నిప్రమాదం... కాటన్ గోదాంలో మంటలు

ఈ సందర్భంగా ఎస్టీపీపీ లోని ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ తనిఖీ చేసి ఆ తర్వాత ఎఫ్​జీడి ప్లాంట్ పనులను పరిశీలించి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీటీసీ సంజయ్ కుమార్ సూర్, ఎస్టీపీపీ జీఎం బసివిరెడ్డి, ఇతర అధికారులు  జేఎన్ సింగ్, ఫిజేరాల్ద్ ప్రసాద్, సుధాకర్, ఎస్వో టు డైరెక్టర్ కేవీ.రావు తదితరులు పాల్గొన్నారు.