మంటల్లో కాలిపోయిన మరో బస్సు.. విశాఖపట్నం నుంచి ఒడిశాలోని జైపూర్ వెళ్తుండగా ఘటన

మంటల్లో కాలిపోయిన మరో బస్సు.. విశాఖపట్నం నుంచి ఒడిశాలోని జైపూర్ వెళ్తుండగా ఘటన

తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొన్న కర్నూలు, నిన్న చేవెళ్ల బస్సు ప్రమాదాలు మరువక ముందే మరో రోడ్డు ప్రమాదం గురువారం (నవంబర్ 06) ఏపీలోని . పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో విశాఖ నుంచి ఒడిశాలోని జైపూర్ వెళ్తున్న బస్సులో ఉదయం ఏడున్నర ప్రాంతంలో మంటలు చెలరేగాయి. 

వైజాగ్ నుంచి వెళ్తున్న బస్సు ఆంధ్రప్రదేశ్-ఒడిశా బార్డర్ దగ్గర ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదానికి గురైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును ఆపేయడంతో ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులు ఐదు మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సునుంచి పొగలు వస్తుండటంతో వెంటనే డ్రైవర్ బస్సును ఆపేశాడు. వెంటనే ప్రయాణికులు బస్సు దిగటంతో ప్రాణ నష్టం తప్పింది. 

సమాచారం తెలుసుకున్న సాలూరు ఫైర్ స్టేషన్ ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు.  పోలీసులు స్పాట్ కు చేరుకుని ఘటనకు గల కారణాలను పరిశీలించారు. ఎవరికా గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రయాణికులను గమ్యం చేర్చే ప్రయత్నం చేస్తున్నారు.